'బిగ్ బాస్ 3'‌లో పాల్గొనడం‌లేదు : గుత్తా జ్వాల - MicTv.in - Telugu News
mictv telugu

‘బిగ్ బాస్ 3’‌లో పాల్గొనడం‌లేదు : గుత్తా జ్వాల

May 26, 2019

I am Not contesting In Bigg Boss season 3.. Badminton Player Gutta Jwala.

బిగ్‌బాస్ 3.. ఇప్పుడంతా ఈ షో గురించే మాట్లాడుకుంటున్నారు. షో ఎప్పుడు మొదలవుతుందా? ఎవరెవరూ కంటెస్టెంట్స్ గా వస్తున్నారు? హోస్ట్ ఎవరు అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ఇప్పటికే బిగ్ బాస్ 3 హోస్ట్‌గా అక్కడినేని నాగార్జునని తీసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు బిగ్‌బాస్ 3లో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల పాల్గొనబోతున్నట్లు కూడా వదంతులు వినిపిస్తున్నాయి.

దీనిపై గుత్తా జ్వాలా ట్విటర్ వేదికగా స్పందించారు. తన గురించి సోషల్ మీడియా, వార్తల్లో వస్తున్నదంతా అబద్ధం అని, తాను బిగ్‌బాస్ షో‌లో పాల్గొనడం లేదని తేల్చి చెప్పేసింది. కాగా బిగ్‌బాస్‌లో టీం వెళ్లి జ్వాలను సంప్రదించి షో పాల్గొనాలని అడగ్గా.. అందుకు ఆమె పారితోషికం ఎక్కువగా అడిగారని, దానికి వారు ఒప్పుకోలేదని సమాచారం. ఇప్పటికే రెండు సీజన్‌లు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్‌బాస్.. మూడో సీజన్‌లో ప్రముఖ యాంకర్ శ్రీముఖి, హీరో వరుణ్ సందేశ్, ఆర్జే హేమంత్ తదితరులు పాల్గొనబోతున్నట్లు సమాచారం.