నా ఆస్తిలో అమృతకు పైసా దక్కదు : మారుతీరావు - MicTv.in - Telugu News
mictv telugu

నా ఆస్తిలో అమృతకు పైసా దక్కదు : మారుతీరావు

June 13, 2019

I am not giving to my property to my daughter amrutha maruthi rao

కూతురు కులాంతర వివాహం చేసుకుందన్న ఆగ్రహంతో అల్లుడిని చంపించి జైలుకెళ్లి, ఇటీవల బెయిల్‌పై విడుదలైన తిరునగరి మారుతీరావు కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన ఆస్తిలో కూతురు అమృత వర్షిణికి  ఒక్కపైసా కూడా దక్కదంటూ వీలునామా రాశారు. ‘నా ఆస్తిలో కూతురుకు వాటా లేదు. నా ఆస్తి అంతా నా స్వార్జితం. అందుకే ఆమెకు ఎలాంటి హక్కు లేదు’ అని స్పష్టం చేశారు. ఈ వీలునామా పత్రాన్ని పోలీసులు చార్జ్ షీట్‌లో పొందుపరిచారు.

కూతురిపై ఎంతో ప్రేమ పెంచుకున్న మారుతీరావుకు ఆమె దళితుడైన  ప్రణయ్ ‌ని ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో పరువు పోయిందని భావించాడు. అంతేకాదు కూతురు తన రిసెప్షన్ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో అతనికి మరింత కోపం పెరిగిపోయింది. గత ఏడాది సెప్టెంబరులో  కోటి రూపాయల సుపారీ ఇచ్చి ప్రణయ్‌ని మిర్యాలగూడలో హత్య చేయించాడు.