నేను వేధించడం లేదు: రవితేజ - MicTv.in - Telugu News
mictv telugu

నేను వేధించడం లేదు: రవితేజ

July 20, 2022

టాలీవుడ్ మాస్ మహారాజా, నిర్మాత రవితేజకు సంబంధించి, పారితోషికం విషయంలో గతకొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌పై తాజాగా ఆయన స్పందించారు. పారితోషికం విషయంలో తాను ఇప్పటివరకు ఎవరినీ, ఏ ఇబ్బంది పెట్టలేదని స్పష్టతనిచ్చారు. అంతేకాదు, నిర్మాతలు ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసినప్పుడు, వారు తనకిచ్చిన చెక్కులను చించేసిన సందర్భాలు చాలు ఉన్నాయని అన్నారు.

”రవితేజ పారితోషికం విషయంలో చాలా కచ్చితంగా ఉంటాడని, నిర్మాతలను బాగా వేధిస్తాడు అనేది పచ్చి అబద్దం. ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రంలో కొన్ని సీన్లను రీషూట్ చేశారని, వాటికి కూడా రవితేజ అదనంగా డబ్బులు డిమాండ్ చేశాడని జరుగుతోన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. అవన్నీ అవాస్తవాలు. ‘రామారావు ఆన్ డ్యూటీకి’ నేనే కోప్రొడ్యూసర్‌ని. అలాంటప్పుడు రెమ్యునరేషన్ సమస్య ఎక్కడి నుంచి వస్తుంది? నిర్మాతలు ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసి, వారిచ్చిన చెక్కులను నేను చాలసార్లు చించేశాను. కావాలంటే ఆ నిర్మాతలను అడగండి” అని ఆయన అన్నారు.

కొన్ని వెబ్ మీడియాలు కావాలనే వార్తలను రాస్తున్నాయి. అవన్నీ తప్పుడు వార్తలు, వాటిని తన అభిమానులు నమ్మొద్దని రవితేజ కోరారు. మరోవైపు ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రం ఈ నెల 29న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబధించిన అన్ని కార్యక్రమాలు పూర్తియ్యాయి. ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్, రాజీషా విజయన్, వేణు తొట్టెంపూడి, నాజర్, నరేశ్, పవిత్ర లోకేశ్ తదితరులు నటించారు.