I am not in 'Pushpa-2': Manoj Baj
mictv telugu

‘పుష్ప-2’లో నేను లేను: మనోజ్ బాజ్

July 21, 2022

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో ‘పుష్ప-2’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆడిషన్స్ కూడా జరిగాయి. అయితే, ఈ ఆడిషన్స్‌లో ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రముఖ నటుడు మనోజ్ బాజ్ నటించబోతున్నారని వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. అంతేకాదు, ఈ పాత్రను చేయాలని చిత్రబృందం ఆయన వేడుకున్నట్టు ప్రచారం కూడా జరిగింది. ఈ క్రమంలో నటుడు మనోజ్ బాజ్ తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొడుతూ, పలు విషయాలను వెల్లడించారు.

”ఇవన్నీ ఒట్టి పుకార్లు. వీటిలో ఏ మాత్రం నిజం లేదు. అసలు, ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయి? నేను మీకూ చెప్పానా? పుష్ప-2లో నటిస్తున్నానని, ఎందుకిలా తప్పుడు వార్తలు రాస్తారు” అంటూ తీవ్రంగా మండిపడ్డారు. అనంతరం సినిమా బడ్జెట్ రూ.1000 కోట్లా, రూ.500 కోట్లా, రూ.300 కోట్లా అనేది తనకు ముఖ్యం కాదని, ఇప్పుడందరూ బాక్సాఫీసు వద్ద ఎంత వసూలు చేసిందన్నదే లెక్కలోకి తీసుకుంటున్నారని ఆయన వివరించారు.

మనోజ్ బాజ్ పేయి ఇటీవలే ‘ఫ్యామిలీ మేన్’ అనే వెబ్ సిరీస్‌లో నటించగా, ఓటీటీ వేదికపై అది సూపర్ హిట్టయింది. ‘ఫ్యామిలీ మేన్-2’లో టాలీవుడ్ బ్యూటీ సమంత కూడా నటించింది. ఆమె నటించిన కొన్ని బోల్డ్ సన్నివేశాలు ప్రకంపనలు రేపాయి. ఈ క్రమంలో పుష్ప-2లో మనోజ్ బాజ్ అదిరిపోయే క్యారెక్టర్ చేస్తున్నారని ప్రచారం జరగడంతో ఆయన స్పష్టతనిచ్చారు.