వివేకా హత్యతో నాకు సంబంధం లేదు.. సుధాకర్ రెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

వివేకా హత్యతో నాకు సంబంధం లేదు.. సుధాకర్ రెడ్డి

March 16, 2019

వైసీపీ నేత, జగన్ చిన్ననా.. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మొదటగా వినిపించిన పేరు వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో శిక్ష అనుభవించి విడుదలైన సుధాకర్ రెడ్డి. అయితే ఇటీవల మీడియాతో మాట్లాడిన సుధాకర్ రెడ్డి.. ఈ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసాడు. వివేకానందరెడ్డి ఇల్లు ఎక్కడున్నదో కూడా తనకు తెలియదని.. తాను ఇప్పుడు తొమ్మిది ఎకరాల్లో అరటిపంట సాగు చేసుకుంటున్నానని తెలిపారు.

i am not involved in ysrcp leader murder case says sudhakar reddy

అసలు వైఎస్ రాజారెడ్డి హత్యకు కూడా తనకు సంబంధం లేదనీ, అన్యాయంగా తనను ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను 12 సంవత్సరాలు జైల్లో నరకయాతన అనుభవించి వచ్చానని తెలిపాడు. గతేడాది జూన్ 20న తాను జైలు నుంచి విడుదల అయ్యానని తెలిపారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన సమయంలో తాను ఇంట్లోనే ఉన్నానని వ్యాఖ్యానించారు. తన పేరు టీవీలో రావడంతో తాను పోలీస్ స్టేషన్‌కు వెళ్లివచ్చానన్నారు. అయితే ఎస్సై లేకపోవడంతో కానిస్టేబుల్‌తో మాట్లాడి వచ్చానన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి వ్యవహారంలో తన పాత్ర ఉన్నట్లు తేలితే ఉరితీయాలని స్పష్టం చేశారు.