‘I am not your servant’: Air hostess tells passenger during mid-air argument
mictv telugu

‘నేను నీ పనిమనిషిని కాదు.. ఉద్యోగిని’.. వీడియో వైరల్

December 22, 2022

‘I am not your servant’: Air hostess tells passenger during mid-air argument

విమానంలో ప్రయాణికుడు-ఎయిర్‌హోస్టెస్ మధ్య జరిగిన వాగ్వివాదానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇస్తాంబుల్‌ నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు, ఎయిర్‌ హోస్టెస్ మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరిగింది. దీన్ని మరో ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయింది. ప్రయాణికుడికి నువ్వు సేవకురాలివి అంటూ ప్యాసింజర్ తీవ్ర వ్యాఖ్యలు చేయగా, ఎయిర్ హోస్టెస్ కూడా అంతే ఘాటుగా సమాధానమిచ్చింది. నేను పనిమనిషిని కాదని ఉద్యోగినని తీవ్ర స్వరంతో బదులిచ్చింది.

 

వివరాలిలా.. ఈ నెల 16వ తేదీన ఇస్తాంబుల్ – న్యూఢిల్లీ విమానంలో ఎయిర్‌హోస్టెస్ ఓ వ్యక్తితో మాట్లాడుతూ, మీ వల్ల మా ఉద్యోగి ఏడుస్తున్నారని, బోర్డింగ్ పాస్‌లో ఏముంటే దాని ప్రకారమే ఆహారాన్ని అందిస్తామని చెప్పారు. దీనికతడు తీవ్రంగా స్పందించాడు. నువ్వు ప్రయాణికుడికి సేవకురాలివి’’ అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో ఎయిర్‌హోస్టెస్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘‘నేను ఉద్యోగిని.. నీకు పనిమనిషిని కాను’’ అని గట్టిగా అరిచింది. దీంతో ‘‘ఎందుకు అరుస్తున్నావు? నోర్మూసుకో..’’ అని ప్రయాణికుడు హెచ్చరించగా, ‘‘నువ్వూ నోర్మూసుకో’’ అని ఎయిర్‌హోస్టెస్‌ బదులిచ్చింది. కేవలం ఆహారం అందించే విషయంలో జరిగిన ఈ గొడవలో ఇద్దరూ ఒకరిపై ఒకరు గట్టిగా అరుచుకున్నారు. చివరికి సహోద్యోగి వారించడంతో ఈ గొడవ సద్దుమణిగింది. ఇపుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.