కాబోయే సీఎంనే ఆపుతావా.. కేఏ పాల్ మళ్లీ ఏసేశాడు - MicTv.in - Telugu News
mictv telugu

కాబోయే సీఎంనే ఆపుతావా.. కేఏ పాల్ మళ్లీ ఏసేశాడు

October 22, 2022

మునుగోడు ఉప ఎన్నికలో అభ్యర్ధిని నిలబెట్టిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. అందుకోసం ప్రచారం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోని చండూరులో తన పార్టీకి చెందిన రెండు ప్రచార వాహనాలు ముందు వెళ్తుండగా, వెనుక పాల్ వాహనం వెళ్తోంది. ఈ సందర్భంగా డీజే సౌండ్ ఎక్కువ పెట్టారని పోలీసులు వీరి వాహనాలను ఆపారు. దీంతో తనదైన శైలిలో మండిపడిన కేఏ పాల్.. తెలంగాణకు కాబోయే సీఎంని. నన్నే ఆపుతావా. ఎవరిచ్చారు అధికారం? రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నా ఫాలోవర్ తెలుసా.. నీ పేరేంటి’ అని మెడలోని ఐడీ కార్డు చూసే ప్రయత్నం చేశారు.

అయితే ఇతర అధికారులు జోక్యం చేసుకుని సర్దిచెప్పడంతో పాల్ తన అనుచరులతో వెళ్లిపోయారు. ప్రచారంలో భాగంగా ప్రజలకు పాల్ తనకే ప్రత్యేకమైన హామీలు ఇచ్చారు. ‘ఎన్నికలో గెలుపు నాదే. మూడు ప్రధాన పార్టీలు రెడ్డీలకే టిక్కెట్లు ఇచ్చాయి. వేరే సామాజిక వర్గాలను పట్టించుకోలేదు. నేను రాజగోపాల్ రెడ్డిని కలిసినప్పుడు అతని అనుచరులు జై కేఏ పాల్ అన్నారు. ఉంగరం గుర్తుకు ఓటు వేస్తామని ప్రజలు అంటున్నారు. గెలిచిన ఆరునెలల్లో ఒక యూనివర్సిటీ, కాలేజీ, హాస్పిటల్ కట్టిస్తాను. మండలానికి వెయ్యి జాబులు ఇప్పిస్తాను. పోటీ చేస్తున్న 27 మంది అభ్యర్ధులు నాకు సపోర్టు చేస్తున్నారు. కాంగ్రెస్‌కు మాత్రం డిపాజిట్ కూడా రాదు.