ఆ విషయం తెలిసి నేను చాలా సంతోషించా: రాశీఖన్నా - MicTv.in - Telugu News
mictv telugu

ఆ విషయం తెలిసి నేను చాలా సంతోషించా: రాశీఖన్నా

July 2, 2022

తెలుగు చిత్రసీమ పరిశ్రమలో అందాల ముద్దుగుమ్మగా పేరుగాంచిన హీరోయిన్ రాశీఖన్నా తన వ్యక్తిగత విషయాలను తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. సినిమాల పరంగా మొదటి సినిమా నుంచి ఇప్పటివరకూ ఏ క్యారెక్టర్ తనకు బాగా పేరుతెచ్చిందో? ఏ క్యారెక్టర్ చేయటం వల్ల ఫ్యాన్స్ బాగా విమర్శలు చేశారో? తనకు కాబోయే భర్తకు ఉండాల్సిన క్యాలిటీలు ఏమి ఉండాలో? అని పలు విషయాలను బయటపెట్టారు.

రాశీఖన్నా మాట్లాడుతూ.. “ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా నేను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాను. ఐఏఎస్ ఆఫీసరై, ప్రజలకు సేవ చేయాలని మొదటి నుంచి ఎన్నో కళలు కన్నా. కానీ, దేవుడు నాకోసం ఈ దారి రాసి పెట్టాడు. అందుకే నటిగా మారి అలరిస్తున్నా. ఇప్పటివరకూ నేను పోషించిన ప్రతి పాత్రను ఎంజాయ్ చేస్తూ చేశా. ‘ఊహలు గుసగుసలాడే’ లోని ప్రభావతి, ‘తొలి ప్రేమలోని వర్ష నాకెంతో నచ్చాయి. ముఖ్యంగా ‘వరల్డ్ ఫేమస్ లవర్‌లో యామిని పాత్రకు నేను బాగా కనెక్ట్ అయ్యా. కాకపోతే, ఆ రోల్ ఎక్కువమందికి నచ్చలేదు. నాపై తీవ్రంగా మండిపడ్డారు. భవిష్యత్తులో మరిన్ని గొప్ప పాత్రల్లో నటించాలని ఉంది” అని ఆమె అన్నారు.

అనంతరం’నేను ‘ప్రతిరోజూ పండగే’ సినిమా షూటింగ్ రాజమండ్రిలో చేస్తున్నప్పుడు ఓ అభిమాని నా వద్దకు వచ్చి, మేడం మీకూ నేను వీరాభిమానిని దయచేసి నా చేతిపై మీ ఆటోగ్రాఫ్ ఇవ్వండి అని అడిగాడు. ఆ తర్వాత రోజు నేను చేసిన ఆ సంతకాన్ని అతడు పచ్చబొట్టు వేయించుకున్నాడని తెలిసింది. ఆ విషయం తెలిసిన వెంటనే నేను చాలా సంతోషించా. నేను నటిగా మారిన తర్వాత ఓ అభిమాని నా సంతకాన్ని పచ్చబొట్టు వేయించుకోవటం ఫస్ట్ టైం అనుకుంటా. నాకు కూడా ఇలాంటి వీరాభిమానులు ఉన్నారా? అని ఆశ్చర్యానికి లోనైయ్యాను. నటిగా మారడం వల్లే నాకెంతో మంది అభిమానం దక్కింది” అని ఆమె అన్నారు.

ఇక, చివరగా మీరు పెళ్లి చేసుకోవాలి అంటే ఎలాంటి లక్షణాలు ఉన్న అబ్బాయి కావాలి? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు రాశీఖన్నా.. తనకు కాబోయే భర్తకు దైవ భక్తి ఎక్కువగా ఉండాలి. మంచి మనసున్న వాడు కావాలని ఆమె చెప్పుకొచ్చారు.