నన్ను క్షమించండి..మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ - MicTv.in - Telugu News
mictv telugu

నన్ను క్షమించండి..మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

March 29, 2020

I apologise to poor of the country for coronavirus hardships, says PM Modi in mann ki baat

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన సంగతి తెల్సిందే. దీంతో కోట్లాది మంది ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ కారణంగా ఎందరో ప్రజలు పని కోల్పోయారు. పట్టణాల నుంచి కార్మికులు, కూలీలు సొంతూళ్లకు కాలినడకన వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ విధించినందుకు పేద ప్రజలు తనను క్షమించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్‌లో కోరారు.

తనపై కొందరు ఆగ్రహంతో ఉన్నారని తనకు తెలుసని అన్నారు. అయినప్పటికీ, కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ఈ కఠిన చర్యలు తీసుకోకతప్పదని చెప్పారు. ముఖ్యంగా పేద ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మోదీ గుర్తు చేశారు. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నది జీవన్మరణ సమస్య అయినందువల్లే కఠిన నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. వైరస్ వ్యాప్తి ప్రారంభమైన రోజుల్లో చర్యలు తీసుకుంటేనే కరోనాను తొలగించవచ్చని అన్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే దేశ ప్రజలు ఇళ్లలోనే ఉండాలని కోరారు.