I can not act if there are such tags: Sai Pallavi
mictv telugu

ట్యాగ్స్‌పై సాయిపల్లవి స్పందన ఇదే..

June 20, 2022

”పేరుకు ముందు ట్యాగ్స్ పెట్టుకోవడం కరెక్ట్ కాదు అని నేను భావిస్తుంటాను. అందుకే ఆ ట్యాగ్స్‌కు నేను త్వరగా కనెక్ట్ కాను. ఇప్పటివరకూ నేను పోషించిన ప్రతి పాత్రలు నచ్చడం వల్లే సినీ ప్రియులు నన్ను ఎంతోగానో ఆదరిస్తున్నారు. వాళ్ల ప్రేమను దృష్టిలో ఉంచుకుని, నేను మరిన్ని మంచి పాత్రల్లో నటించాలి. ఇలాంటి ట్యాగ్స్‌ని తలకెత్తుకుంటే ఒత్తిడికి గురై, నేను సరిగ్గా నటించలేను. నేను సాధారణంగా ఉండటానికే ఇష్టపడతాను” అని సాయి పల్లవి ఇటీవలే ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.

ఈ వ్యాఖ్యలు సాయిపల్లవి ఎందుకు చేసింది? ఆమెకు ప్రేక్షకులు ఏ ట్యాగ్ ఇచ్చారు? అనే సందేహాలు మీకూ రావచ్చు.. అదేనండి ‘విరాటపర్వం’ సినిమా మొదలైన రోజు నుంచి నేటివరకు సాయిపల్లవిని ఆమె అభిమానులు ‘లేడీ పవర్ స్టార్, లేడీ పవర్ స్టార్’ అంటూ సోషల్ మీడియాలో ప్లెక్సీలపై ఆ ట్యాగ్‌ను తెగ వైరల్ చేశారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సాయిపల్లవి మాట్లాడుతుండగా ఆమె వెనక స్క్రీన్‌పై ‘లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి’ అనే ట్యాగ్‌తో డిస్‌ప్లే రన్ చేశారు. ఆ ట్యాగ్‌పై సాయిపల్లవి స్పందిస్తూ, అలాంటి ట్యాగ్ ఉంటే నేను సినిమాలో సరిగ్గా నటించలేనని స్పష్టం చేసింది.

ఇక, ‘విరాటపర్వం’ సినిమా విషయానికొస్తే.. వేణు ఊడుగుల తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన రోజు నుంచి ఇప్పటివరకూ మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. నక్సలిజం కథతో 1990లో జరిగిన వాస్తవ ఘటనలు, వరంగల్‌కు చెందిన తూము సరళ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించిన విషయం తెలిసిందే.