I cried after lip locking with Vijay : Rashmika mandanna
mictv telugu

విజయ్‌తో లిప్‌లాక్ తర్వాత ఏడ్చేశా.. పీడకలలు వచ్చేవి : రష్మిక

October 4, 2022
I cried after lip locking with Vijay : Rashmika mandanna
 

దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకొని నేషనల్ క్రష్మికగా పేరు తెచ్చుకున్న రష్మిక మందన్నా బాలీవుడ్‌లో దూసుకుపోతోంది. స్టార్ నటుల సరసన కథానాయికగా అవకాశాలు చేజిక్కించుకుంటూ టాప్ ప్లేసులో నిలిచింది. ఇంత పేరు రావడానికి పుష్ప సినిమానే కారణమని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అయితే దానికన్నా ముందు విజయ్ దేవరకొండతో రెండు సినిమాలు చేసి లిప్ లాక్ సీన్లతో అదరగొట్టేసింది. దాంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందనే గుసగుసలు వినిపించాయి. ఇదంతా ఒకవైపు అయితే ఆ ముద్దు సీన్ల వల్ల తన జీవితంలో చేదు అనుభవాలు కూడా ఎదురయ్యాయని రష్మికా తెలిపింది. ఆమె తాజాగా నటించిన గుడ్ బై చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘విజయ్ దేవరకొండతో నేను రెండు సినిమాలు చేశా. అందులో గీత గోవిందంలో చేసిన ముద్దు సీన్ పట్ల ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కానీ, డియర్ కామ్రేడ్ సినిమాలో చేసిన ముద్దు సీన్లను మాత్రం విపరీతంగా ట్రోల్ చేశారు. పబ్లిసిటీ కోసమే కథకు అవసరం లేకపోయినా ఇరికించారని విమర్శించారు. పాపులారిటీ కోసం ఏదైనా చేస్తారా? అని సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తి పోశారు. దాంతో చాలా ఏడుపు వచ్చింది. కొన్ని నెలల పాటు బాధపడ్డాను. నాకు వ్యతిరేకంగా చాలా వార్తలు వచ్చాయి. దాంతో నిద్రలో పీడకలలు వచ్చేవి. ఒక్కదాన్నే ఉన్నట్టు, నన్ను వెన్నుపోటు పొడుస్తున్నట్టు అనిపించేది. దాదాపు రోజూ వచ్చే ఈ కలలతో అది నిజమో కాదో అర్ధం అయ్యేది కాదు. కలతతో నిద్రలేచి ఏడ్చేదాన్ని. ఒక్కోసారి ఏడుపుతోనే మేల్కొనేదాన్ని. అయితే ఈ విషయాలేవీ పేరెంట్స్‌కి తెలియకుండా జాగ్రత్తపడ్డాను. వారికి ఇలాంటి విషయాలు అంతగా తెలియవు. వారు బాధపడడం నాకు ఇష్టం లేద’ని వివరించింది.