నేను తప్పు చేశా.. సోనియా గాంధీ ఒప్పుకోలు - MicTv.in - Telugu News
mictv telugu

నేను తప్పు చేశా.. సోనియా గాంధీ ఒప్పుకోలు

March 14, 2022

bfbf

పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి తాను కూడా కారణమని ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఒప్పుకున్నారు. గత సీఎం అమరీందర్ సింగ్‌పై ఫిర్యాదులొచ్చిన ప్రతీసారీ వెనకేసుకొచ్చేదాన్నని గుర్తు చేసుకున్నారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయంపై నిర్వహించిన సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియా గాంధీ పై వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నిర్వహించిన ఈ సమావేశంలో సోనియా గాంధీ నాయకత్వంలోనే కొనసాగేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా పంజాబ్ ప్రస్తావన వచ్చింది. ఒక సభ్యుడు అమరీందర్‌ని తొలగించాలనుకున్నప్పుడు కొంత ముందే ఆ పని చేసి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. అలా జరిగి ఉంటే ఎన్నికల నాటికి పరిస్థితి సద్దుమణిగి ఉండేదన్నారు. కాగా, ఎన్నికలకు కొద్ది ముందు అమరీందర్ చేత రాజీనామా చేయించి చన్నీని ముఖ్యమంత్రిగా నియమించిన విషయం తెలిసిందే. దీంతో చిర్రెత్తిన అమరీందర్ కొత్త పార్టీ పెట్టి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. మరోవైపు సిద్ధూ గొడవతో అంతర్గత పోరు ఎక్కువై పార్టీ అధికారాన్ని కోల్పోయింది. సీఎం చన్నీ, సిద్ధూతో పాటు అమరీందర్ కూడా ఓడిపోయాడు.