గతవారం భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన సీజేఐ చంద్రచూడ్ మూన్ లైటింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఓ వైపు లాయర్ గా పని చేస్తూనే ఆల్ ఇండియా రేడియోలో ‘ప్లే ఇట్ కూల్, ఏ డేట్ విత్ యూ, సండే రిక్వెస్ట్’ వంటి షోలలో ఆర్జేగా పని చేస్తున్నట్టు వెల్లడించారు.
ఓ కాన్ఫరెన్స్ సందర్భంగా సీజేఐ మాట్లాడిన వీడియోను బార్ అండ్ బెంచ్ ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసింది. ‘అప్పట్లో చాలా మందికి మూన్ లైటింగ్ గురించి తెలియదు. కానీ, 20 ఏళ్ల ప్రాయంలోనే అదనపు ఆదాయం కోసం రేడియో జాకీగా ప్రోగ్రామ్స్ చేశా. నేటికీ సంగీతంపై నాకున్న అభిమానం కొనసాగుతోంది. ప్రతీరోజు న్యాయ విధులు నిర్వర్తిస్తూనే ఇంటికి వెళ్లి సంగీతాన్ని ఆస్వాదిస్తా’నని తెలిపారు. కాగా, కరోనా నేపథ్యంలో చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. ఈ క్రమంలో అదనపు ఆదాయం కోసం ఉద్యోగులు రెండేసి ఉద్యోగాలను ఏకకాలంలో చేస్తున్నారు. అయితే కంపెనీలు ఈ పద్ధతిని వ్యతిరేకిస్తున్నాయి. మూన్ లైటింగ్ అంటే కంపెనీని మోసం చేయడమేనని తప్పుబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విప్రో 300 మందికి ఉద్వాసన పలికింది. టెక్ కంపెనీల ప్రకారం ఒకేసారి రెండు ఉద్యోగాలు చేయకూడదన్న నిబంధన ఉంది. అయితే కొన్ని కంపెనీలు దీన్ని సమర్ధిస్తున్నాయి. కంపెనీ ప్రధాన వ్యాపారంతో సంబంధం లేని పని ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకోవడం నేరమేమీ కాదని స్పష్టం చేస్తున్నాయి. దీంతో మూన్ లైటింగ్ వ్యవహారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
Did you know CJI DY Chandrachud moonlighted as a RADIO JOCKEY in his early 20's – Do listen to him#SupremeCourt #SupremeCourtofIndia #cjichandrachud
Video Credit – BCI pic.twitter.com/EdvRqntXST
— Bar & Bench (@barandbench) December 4, 2022