నటి కాకముందు ఆ పనులే ఎక్కువగా చేశా: రవీనా - MicTv.in - Telugu News
mictv telugu

నటి కాకముందు ఆ పనులే ఎక్కువగా చేశా: రవీనా

April 23, 2022

ప్రస్తుతం సినీ ప్రియులకు రవీనా టండన్‌ అంటే తెలియని వారుండరు. ఆమె ఇటీవలే నటించిన కేజీయఫ్ 2 సినిమా దేశవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో విడుదలై రికార్టులు బద్దలు కొట్టింది. ఈ చిత్రంలో రవీనా టండన్‌ తన నటనతో ప్రేక్షుకుల మనసులలో చెరిగిపోని ముద్రవేసుకుంది.

అయితే, సినిమాలలోకి రాకముందు తాను ఏం చేసిందో ఓ ఛానెల్‌కి ఇంటర్య్వూలో సంచలన విషయాలను బయటిపెట్టింది. రవీనా టండన్‌ మాట్లాడుతూ.. ”అసలు నాకు సినిమాల్లోకి రావాలన్న ఆలోచనే లేదు. సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న ఫ్యామిలీలో పుట్టి పెరిగాను. కానీ, ఎప్పుడూ యాక్టర్ అవ్వాలని అనుకోలేదు. మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ, నేను మొదట్లో స్టూడియో ఫ్లోర్స్‌ తుడిచేదాన్ని, ఎవరైనా వాంతులు చేసుకుంటే నేను వెళ్లి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసేదాన్ని” అని ఆమె అన్నారు.

అంతేకాకుండా ‘ప్రహ్లాద్‌ కక్కర్‌ దగ్గర అసిస్టెంట్‌గా కూడా పని చేశాను. పదో తరగతి పూర్తి చేశాక అనుకుంటా.. ఇలాంటి పనులు చాలా చేశాను. చాలా మంది నన్ను చూసి నువ్వు స్క్రీన్‌ ముందు ఉండాల్సినదానివి అనేవారు. ఆ మాటలు విని నేనా? నటిగా మారడామా? అస్సలు ఛాన్సే లేదు అని సమాధానం చెప్పేదాన్ని. అనుకోకుండా చివరకు నటిగా మారాను’ అని ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్నీ పరిశ్రమల్లో తన నటనకు మంచి గుర్తింపు వచ్చిందని ఆనందాన్ని వ్యక్తం చేసింది.