నేను దాక్కోలేదు.. ఇదిగో నా లొకేషన్ : జెలెన్‌స్కీ - MicTv.in - Telugu News
mictv telugu

నేను దాక్కోలేదు.. ఇదిగో నా లొకేషన్ : జెలెన్‌స్కీ

March 8, 2022

రష్యాతో జరుగుతున్న యుద్ధంలో తాను పారిపోయి దాక్కున్నట్లు వస్తున్న వార్తలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కొట్టిపారేశారు. తాను ఎక్కడికీ వెళ్లలేదనీ, రాజధాని కీవ్‌లోనే ఉన్నానని స్పష్టం చేశారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రాంలో ఓ వీడియోను విడుదల చేశారు. అందులో తన కార్యాలయంలోనే కూర్చుని, అక్కడి లొకేషన్‌ను షేర్ చేసి మాట్లాడారు. ఆ వీడియోలో ‘ నేను బంకోవా వీధిలోని కైవ్‌లో ఉన్నాను.

 

నేను ఎవరికీ భయపడి ఎక్కడా దాక్కోలేదు. రష్యాకు ఎదురొడ్డి పోరాడడంలో మేమంతా కలిసి పనిచేస్తున్నాము. శతృదేశానికి ఓటమి తప్పదు’ అని పేర్కొన్నారు. కాగా, రష్యా దాడులు ప్రారంభించి మంగళవారంతో 13వ రోజుకు చేరింది. మరోవైపు రష్యా – ఉక్రెయన్‌ల మధ్య మూడో విడత చర్చలు కూడా విఫలమయ్యాయి. దాంతో గురువారం రోజు జరిగే చర్చలపైన అంతర్జాతీయ ద‌ృష్టి పడింది. . ఆ రోజు ఇరు దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం టర్కీలో జరగబోతోందని సమాచారం.