నేను అలా మాట్లాడలేదు.. జగన్ నా సోదరుడు: కేటీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

నేను అలా మాట్లాడలేదు.. జగన్ నా సోదరుడు: కేటీఆర్

April 30, 2022

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో శుక్రవారం క్రెడాయ్ హెచ్ఐసీసీలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షో సందర్భంగా కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు ఏపీ మంత్రులకు కోపాన్ని తెప్పించాయి. కేటీఆర్ వ్యాఖ్యలను తిప్పికొడుతూ, బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజాతోపాటు పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు వ్యాఖ్యలు చేశారు. దీంతో తెలంగాణ మంత్రులు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలలో తప్పు ఏముంది అంటూ ఏపీ మంత్రులకి సమాధానాలు ఇచ్చారు.

ఈ క్రమంలో తాను చేసిన వ్యాఖ్యలు ఏపీ మంత్రులకు బాధను కలిగించాయి అని గుర్తించిన కేటీఆర్..ట్విటర్ వేదికగా శుక్రవారం అర్థరాత్రి 12 గంటల సమయంలో స్పందించారు.”క్రెడాయ్ సమావేశంలో నేను చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్‌లోని నా స్నేహితులకు తెలియకుండానే కొంత బాధ కలిగించి ఉండొచ్చు. ఈ వ్యాఖ్యల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదు. ఎవరినో బాధ పెట్టాలనో, కించపరచాలనో అలా మాట్లాడలేదు. నేను ఏపీ సీఎం జగన్ సోదరులం. ఆయన నాయకత్వంలో ఆ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నా” అని ఆయన పేర్కొన్నారు.