రెండో పెళ్లి చేసుకోలేదు, ఆ ఫోటోలు ఎందుకంటే.. అమలాపాల్ - MicTv.in - Telugu News
mictv telugu

రెండో పెళ్లి చేసుకోలేదు, ఆ ఫోటోలు ఎందుకంటే.. అమలాపాల్

March 23, 2020

kzfjdrh

నటి అమలాపాల్‌ రెండో పెళ్లి చేసుకుందంటూ కొత్త  భర్తతో లిప్ లాక్ కిస్ పెడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తను ప్రేమించిన ముంబై బేస్డ్ సింగర్ భవీందర్ సింగ్‌తో మూడు ముళ్లు వేయించుకుందని తెగ ప్రచారం జరిగింది. దీనిపై అమల్ కూడా స్పందించలేదు. అయితే తాజాగా ఆమె ఓ తమిళ న్యూస్ చానెల్‌తో మాట్లాడింది. తన రెండో పెళ్లి జరిగిందని వస్తున్న ప్రచారాన్ని ఆమె ఖండించింది.తాను రెండో పెళ్లి చేసుకోలేదని.. నెట్‌లో ఉన్న ఫోటోలు నేను భాగస్వామిగా ఉన్న ఓ సంస్థ కోసం చేసిన ఫోటో షూట్‌ కోసం అని స్పష్టంచేసింది. 

ఒకవేళ తాను పెళ్లి చేసుకుంటే అందరికీ ముందే చెబుతానని పేర్కొంది. కాగా, చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నప్పుడే అమలాపాల్.. తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్‌తో ప్రేమలో పడింది. 2014లో పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగేళ్లకే విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. తిరిగి ఆమె సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. దర్శకుడు విజయ్‌తో విడిపోయాక అమల కొత్త జీవితం కోసం ప్రయత్నిస్తోందని, ఆ క్రమంలో ఆమెకు కొన్ని చేదు అనుభవనాలు ఎదురయ్యాయని వార్తలు వస్తున్నాయి. చివరికి భవీందర్‌తో ప్రేమాయణం కూడా పెళ్లికి చేరకపోవచ్చనే గుసగుసలు వినిపిస్తున్నాయి.