Home > Featured > ముందు ఆ పాత్ర చేయనన్నా..కానీ, భక్తితో ఓకే చేశా: ప్రభాస్

ముందు ఆ పాత్ర చేయనన్నా..కానీ, భక్తితో ఓకే చేశా: ప్రభాస్

తెలుగు చిత్రసీమ పరిశ్రమ ఆగ్రనటుల్లో ఒకడిగా నటుడు ప్రభాస్‌ ఇప్పటికే పలు సంచలన రికార్డులను సృష్టించి, పాన్ ఇండియా స్టార్‌గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. బహుబలి పార్ట్-1, పార్ట్-2లతో యావత్ దేశ సినీ ప్రియులను కాకుండా ప్రపంచదేశాల్లో ఉన్న సినీ ప్రియులను సైతం తన నటనతో ఆకర్షించారు. ప్రస్తుతం పలు భారీ యాక్షన్ సినిమాలు చేస్తూ, బీజీ బీజీగా ఉన్నారు.

ఈ క్రమంలో ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం 'ఆదిపురుష్'. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను గతరాత్రి చిత్రబృందం విడుదల చేసింది. ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతి సనన్, రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించారు. అయితే, రాముడి పాత్రకు సంబంధించి, హీరో ప్రభాస్ పలు సంచలన విషయాలను మీడియా ముందు వెల్లడించాడు.

ప్రభాస్ మాట్లాడుతూ…"రాముడి పాత్రను పోషించేందుకు తొలి మూడు రోజులు నేను ఒప్పుకోలేదు. కానీ, చివరికి రాముడిపై ఉన్న భక్తి, భయమే నన్ను ఈ 'ఆదిపురుష్'లో నటించేలా చేశాయి. ప్రతి మనిషిలోనూ రాముడు ఉంటాడు. ఈ సినిమాలో నేను చాలా భయంతో యాక్ట్ చేశా. అభిమానులకు, సినీ ప్రియులకు అందరికీ బాగా నచ్చుతుంది" అని ఆయన అన్నారు. ఇక, ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జనవరి 12న విడుదల కానుంది.

Updated : 3 Oct 2022 2:23 AM GMT
Tags:    
Next Story
Share it
Top