నా పార్టీలో నాకే గ్యారంటీ లేదు : బండి సంజయ్ - MicTv.in - Telugu News
mictv telugu

నా పార్టీలో నాకే గ్యారంటీ లేదు : బండి సంజయ్

April 12, 2022

ssss

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపుపై మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీకోసం కష్టపడిన వారికి తప్ప వ్యక్తుల కోసం పని చేసిన వారికి టిక్కెట్లు రావు అని స్పష్టం చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభానికి ముందు ఆయన పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘టిక్కెట్లు ఇప్పిస్తామంటూ కొందరు నాయకులను మభ్యపెడుతున్నారు. తిప్పుకున్న వారికీ, తిరిగిన వారిద్దరికీ టిక్కెట్లు రావు. యూపీ ఎన్నికల్లో టిక్కెట్ ఇప్పిస్తామని చెప్పినవారికే టిక్కెట్టు రాలేదు. సీఎం అవుతామని చెప్పుకునేవారు బీజేపీలో సీఎం కాలేరు. పార్టీ అధ్యక్షుడినైనప్పటికీ, నా టిక్కెటుపై నాకే స్పష్టత లేదు’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కేసీఆర్ రైతులపై చేస్తున్న నాటకాలపై మండిపడ్డారు. కేంద్రం దేశం మొత్తం దృష్టిలో పెట్టుకొని విధానాలను రూపొందిస్తుందనీ, కేసీఆర్ కుటుంబానికి ప్రత్యేకంగా ఏమీ ఉండదని ఎద్దేవా చేశారు.