I do not know when we will die .. 4 thousand couples in Ukraine ..
mictv telugu

‘ఎప్పుడు చస్తామో’ తెలీదు.. ఉక్రెయిన్‌లో 4వేల జంటలు..

June 27, 2022

vu

ఉక్రెయిన్ దేశంలోని యువకులు, యువతులు ‘ఏ క్షణంలో చస్తామో తెలియదు. బతికినన్నాళ్లు కలిసి సంతోషంగా బతుకుదాం’ అనే భావనతో 4 వేల జంటలు విహవా బంధంతో ఒకటైయ్యాయి. ప్రస్తుతం ఓ యువ జంట సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పోస్ట్ అందరి మనసును కదిలిస్తోంది. ‘పరిస్థితులు చక్కబడితే కలిసి జీవనం కొనసాగిద్దాం. లేదంటే భార్యాభర్తలుగా కలిచి చచ్చిపోదాం’ అని కేథరినా లైట్వినెంకో, ఇహోర్ జక్వాట్ స్కీ తీవ్ర భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు.

రష్యా దాడులతో ఉక్రెయిన్ ప్రజల జీవితాలు అల్లకల్లోలంగా మారాయి. ఏ క్షణంలో ఎక్కడ మిస్సైల్ పడుతుందో, బాంబుల వర్షం కురుస్తుందో, ఎవరు ప్రాణాలు కోల్పోతారో ఊహించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున యువతి, యువకులు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోనే తాజాగా 4 వేల జంటలు పెళ్లి చేసుకున్నాయి.

మరోపక్క ఇతర దేశాలకు వలసవెళ్లిన ఉక్రెయిన్ ప్రజలు కూడా స్వదేశానికి తిరిగొచ్చి, వివాహబంధంతో ఒక్కటవుతున్నారు. తాజాగా కీవ్‌లో ఓ చర్చిలో జరిగిన పెళ్లి అనంతరం కేథరినా లైట్వినెంకో, ఇహోర్ జక్వాట్ స్కీ తీవ్ర భావోద్వేగానికి గురై ‘ఏ క్షణంలో చస్తామో తెలియదు. బతికినన్నాళ్లు కలిసి సంతోషంగా బతుకుదాం. లేదంటే భార్యాభర్తలుగా కలిచి చచ్చిపోదాం’ అనే వ్యాఖ్యలు అందరినీ కలిచివేస్తున్నాయి.