‘ఆర్ఆర్ఆర్’లో హీరోలెవరో తెలీదు : నటి శ్రియ - MicTv.in - Telugu News
mictv telugu

‘ఆర్ఆర్ఆర్’లో హీరోలెవరో తెలీదు : నటి శ్రియ

March 31, 2022

bfcbfcb

రాజమౌళి తీసిన ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్‌లో హీరోలెవరో నాకు తెలీదని నటి శ్రియ సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే ఇది సినిమా ఒప్పుకున్నప్పుడు జరిగిన విషయం అని తెలిపింది. రాజమౌళి సినిమా అనగానే హీరోలెవరు? నా పాత్ర ఏంటి? అని ఏమీ అడగకుండానే సినిమాకు సంతకం చేసినట్టు వివరించింది. శ్రియ ఆర్ఆర్ఆర్‌లో అజయ దేవగణ్‌కు జోడీగా నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్ నిమిత్తం బెంగళూరు వచ్చిన శ్రియను ఓ ఆంగ్ల పత్రిక ఇంటర్వ్యూ నిర్వహించింది. దాంతో శ్రియ రాజమౌళితో తన అనుభవాలను చెప్పుకొచ్చింది. ‘ ఛత్రపతి సినిమా కోసం మొదటిసారి రాజమౌళితో పనిచేశా. ఆ తర్వాత అవకాశం వస్తే తప్పకుండా మళ్లీ నటించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ ఆఫర్ వచ్చింది. షూటింగ్ ప్రారంభమయ్యాకనే చరణ్, తారక్ హీరోలని తెలిసింది. వాళ్ల స్టార్‌డమ్‌కు తగిన హిట్ ఇన్నేళ్లకు వచ్చింది. ఇప్పటి వరకు సినిమా చూడలేదు. ముంబైలో ప్రయత్నించా.. కానీ, టిక్కెట్లు దొరకలేదు. ఎక్కడ చూసినా హౌస్‌ఫుల్ బోర్డులు కనిపించాయి. వచ్చే వారమైనా టిక్కెట్లు దొరుకుతాయని భావిస్తున్నా’నంటూ చెప్పుకొచ్చింది.

RRR-REV