పవన్ కళ్యాణ్ పక్కన హీరోయిన్ ఛాన్స్ ఎవరైనా ఎగిరి గెంతులెస్తారు. ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వచ్చిందని, డేట్స్ సర్దుబాటు చేస్తారు. అలాంటిది.. తనకు ఛాన్స్ వస్తే మాత్రం చచ్చినా చేయనంటోంది యంగ్ బ్యూటీ ప్రియాంకా జవాల్కర్. అయితే.. ఇందుకు ఓ బలమైన కారణం ఉందని చెబుతోంది. తనకు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి అని, ఆయనంటే పడి చస్తానని తెలిపింది. పవన్ ‘తమ్ముడు’ సినిమాను తాను 20 సార్లు చూశానని.. ఖుషీ సినిమాలో ప్రతీ డైలాగ్ గుర్తుందని పేర్కొంది. పవన్ కళ్యాణ్‌కి పెద్ద ఫ్యాన్ అని చెప్పిన ప్రియాంక.. ఆయన్ను అలాగే దూరం నుంచి చూస్తూ అభిమానిగానే ఉండిపోవాలని ఉందని చెప్పింది. అంతకుమించి ఇంకేం కోరుకోవడం లేదని.. ఒకవేళ సినిమా ఛాన్స్ వచ్చినా చేయనని చెప్పింది. పెద్ద స్టార్ హీరో అయ్యుండి కూడా.. అంత సింపుల్‌గా ఎలా ఉంటారో తనకు అర్థం కావట్లేదని తెలిపింది.
రాయలసీమలోని అనంతపురం ప్రాంతానికి చెందిన ప్రియాంకా, తొలుత షార్ట్ ఫిల్మ్స్‌తో తన కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత.. ‘ట్యాక్సీవాలా’ సినిమాలో నటించే బంపరాఫర్ కొట్టేసింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు పొందడంతో.. ఇక ఈ బ్యూటీకి తిరుగు ఉండదని అంతా భావించారు. కానీ.. ఏమైందో తెలీదు.. ఆ సినిమా తర్వాత ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ఇటీవలే వచ్చిన ఎస్.ఆర్. కళ్యాణమండపం హిట్ అయింది కానీ.. అందులో నటించిన ఈమెకి మాత్రం పెద్ద పేరు ఏం రాలేదు. ఇలాంటి సమయంలో ఎవ్వరైనా.. స్టార్లతో ఒక సినిమా చేసి, స్టార్డమ్ పొందాలని అనుకుంటారు. కానీ.. ప్రియాంకా మాత్రం విచిత్రంగా పవన్ సినిమాలో అవకాశం వచ్చినా చేయనని చెబుతోంది. ఇది కూడా పబ్లిసిటీ కోసమే లేదంటే మీడియా అటెన్షన్ కోసమో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.