I don't have any tension..They must be punished..Gorantla Madhav
mictv telugu

దొంగలు దొరుకుతారు..గోరంట్ల మాధవ్

August 10, 2022

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో హిందూపురానికి చెందిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు సంబంధించిన ఓ న్యూడ్ వీడియో గతకొన్ని రోజులుగా అనేక మలుపులు తిరుగుతోంది. ఆ వీడియోలో ఉన్నది గోరంట్ల మాధవ్‌వే? అని కొందరు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటే, మరికొందరు ఆ వీడియోలో ఉన్నది ఆయన కాదంటూ తేల్చి చెప్తున్నారు. మరి ఇంతకీ ఎవరు ఆ వీడియోలో ఉన్నది? అధికారులు ఏం చెప్పారు? ఎంపీ గోరంట్ల మాధవ్ ఏం సమాధానం ఇచ్చారు? అనే తదితర విషయాలపై రాష్ట్రవ్యాప్తంగా అటు ప్రజలు, ఇటు ప్రతిపక్ష నాయకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో కాసేపటిక్రితమే అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప మీడియా ముందు ఓ కీలక విషయాన్ని వెల్లడించారు.‘ఆ వీడియో ఎక్కడ నుంచి వచ్చిందో విచారణ జరిపాం. సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న వీడియో ఒరిజినల్ వీడియో అని నిర్ధారించలేకపోతున్నాం. దాన్ని మార్ఫింగ్ చేసినట్లు అనుమానిస్తున్నాం. వీడియోలో ఉన్నది మాధవో కాదో చెప్పలేం” అని అన్నారు.

అయితే, ఈ వ్యవహారంపై ఎస్పీ గోరంట్ల మాధవ్ మరోసారి స్పందించారు. ”నేను మొదటి నుంచి చెబుతున్నట్లుగానే.. ఇది వంద శాతం ఫేక్ వీడియో. నాపై కుట్రలు చేసిన వారు కచ్చితంగా చట్టానికి దొరకబడి, శిక్షింపబడుతారు. ఈ కేసులో నేను కడిగిన ముత్యంలా బయటపడతానని నాకు తెలుసు. అందుకే, నేను మొదటి నుంచి టెన్షన్ పడలేదు, పడను కూడా. ఈ వ్యవహారంపై నేను పూర్తి కాన్ఫిడెంట్‌తో ఉన్నా. ఇక, నాపై ఫేక్ వీడియో పోస్ట్ చేసిన వారిపై, అలాగే, దాన్ని ప్రసారం చేసిన రెండు మీడియా ఛానల్స్‌పై క్రిమినల్ కేసులు పెట్టిస్తా. పరువునష్టం దావా వేస్తా.” అని ఆయన అన్నారు.