బాలీవుడ్ నటి రాధికా ఆప్టే హిందీలో ఎక్కువ సినిమాలు చేస్తున్నా మన టాలీవుడ్‌కి రక్తచరిత్ర, లెజెండ్ వంటి సినిమాలతో పరిచయమైంది. సినిమాలు కాక, వివాదాలతోనే ఎక్కువ పాపులర్ అయిన నటి ఈవిడ. ప్రస్తుతం ముంబైలో సినిమా షూటింగులో ఉన్న రాధికా.. అభిమానులతో సోషల్ మీడియాలో చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా వారు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చింది. కొందరు పర్సనల్ విషయాల గురించి అడగ్గా, వాటికి రాధిక ఎంతో ఓపికతో జవాబులిచ్చింది. నీ ఏజెంత? ప్రస్తుతం ఎక్కడున్నావు? వాట్సాప్ డీపీ ఏంటి? భర్తలో నచ్చని గుణం ఏంటి? వంటి ప్రశ్నలకు రాధికా చిన్న పదాలతో స్పందించింది. తన వయసు సెప్టెంబరు నాటికి 37 ఏళ్లని, ముంబైలోని బాంద్రాలో ఉన్నట్టు, పనివల్ల బిజీగా ఉన్నానని చెప్పింది. భర్త అంత పొడుగ్గా ఉండడం తనకు నచ్చదని మొహమాటం లేకుండా సూటిగా చెప్పేసింది. మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరని అడిగితే రజనీకాంత్‌తో దిగిన ఫోటోను షేర్ చేసింది. కాగా, రాధికా ఆప్టే భర్త విదేశాల్లో ఉంటాడు. ఈమె ఇండియాలో ఉంటుంది.