I don't need Bharat Ratna :P Sushila
mictv telugu

నాకు భారత రత్న అవసరం లేదు.. ఆ తృప్తి చాలు

October 24, 2022

గాన సరస్వతి పద్మభూషణ్ పి. సుశీల ఇప్పటివరకు తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ, ఒరియా, మరాఠీ తదితర భాషల్లో సుమారు 70 వేలకు పైగా పాటలు పాడారు. దీంతో గిన్నీస్ రికార్డు కూడా నెలకొల్పారు. ఈ నేపథ్యంలో తమిళ సినీ పత్రికా సంఘం శనివారం సాయంత్రం నిర్వహించిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. అవార్డుల పట్ల కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు పద్మభూషణ్ అవార్డు కోసం అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి సిఫారసు చేశారని గుర్తు చేశారు. ఇక భారత రత్న అంటారా? అది నాకు అవసరం లేదని, శ్రోతల గుండెల్లో ఉండిపోయానన్న తృప్తి చాలన్నారు. తన పేరుతో ఓ ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద కళాకారులకు ప్రతీనెలా పింఛను ఇస్తున్నానని వెల్లడించారు. ప్రతీ ఏడాది ఒక ఉత్తమ సంగీత కళాకారుడిని ఎంపిక చేసి లక్ష రూపాయల నగదును బహుమతిగా అందిస్తున్నానని వివరించారు. తన పాటలకు రాయల్టీ వచ్చుంటే మరికొంతమందికి సాయమందించే అవకాశం దక్కేదన్నారు. సంగీతం తమ కాలంలో పరిశుద్ధంగా ఉండేదనీ, ఇప్పిటికాలంలో.. అంటూ నవ్వేశారు.