తప్పో, ఒప్పో.. నాకిష్టమైందే చేశా, ధిక్కరించా.. సన్నీలియోన్ - MicTv.in - Telugu News
mictv telugu

తప్పో, ఒప్పో.. నాకిష్టమైందే చేశా, ధిక్కరించా.. సన్నీలియోన్

January 27, 2020

Sunny Leone.

చేసిన తప్పులను ఒప్పుకోవడంలో చాలా తక్కువ మంది ముందుంటారు. ఈ వరసలో ప్రముఖ బాలీవుడ్, పోర్న్‌స్టార్ సన్నీ లియోన్ ముందుంటారు. తప్పు కావాలని చేసినా, పొరపాటున చేసినా తప్పు తప్పే అని సన్నీ తెలిపారు. తాను చాలాసార్లు సమాజం కట్టుబాట్లను కాలరాశానని చెప్పారు. ప్రముఖ మ్యూజిక్ సంస్థ గానా నిర్వహించిన ‘కన్ఫెషన్స్ విత్ సన్నీ లియోన్’ కార్యక్రమంలో సన్నీ తన గత అనుభవాలను పంచుకున్నారు. ‘నేను తెలిసో తెలియకో చాలాసార్లు కట్టుబాట్లను ధిక్కరించాను. తప్పని పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చింది. నేనెప్పుడూ నా కుటుంబానికి, నాకు ఉపయోగకరమైన నిర్ణయాలే తీసుకున్నాను. నమ్మిన ఆలోచనలను  కచ్చితంగా అమలుచేశాను’ అని సన్నీ వెల్లడించారు.

తాను ఈ మాటలు చెప్పడంతో చాలామందికి ఇటువంటి విషయాలు బయటకు చెప్పే ధైర్యం వస్తుందని చెప్పారు. అందుకే తాను ఈ విషయాలు వెల్లడించినట్లు ఆమె స్పష్టంచేశారు. అయితే తాను చేసే పనులను చాలామంది తప్పుబడుతుంటారని, అలా చేయడం చాలా తేలికైన పని అని తెలిపారు. అసలు విషయం తెలియకుండా ఎదుటి వారు చేసేది తప్పో ఒప్పో మనం ఎలా చెప్తాం? అని సూటిగా ప్రశ్నించారు. మన గురించి మనమే పూర్తిగా తెలుసుకోలేనప్పుడు ఇతరులు గురించి ఎలా అవలీలగా బేరీజు వేయగలం? అని అడిగారు.