నాకిది మరుపురాని రోజు.. భావోద్వేగంగా మహేశ్ ట్వీట్ - MicTv.in - Telugu News
mictv telugu

నాకిది మరుపురాని రోజు.. భావోద్వేగంగా మహేశ్ ట్వీట్

January 26, 2020

Mahesh Babu.

‘నా మరపురాని రోజులలో ఈరోజు ఒకటి’ అంటూ సూపర్ స్టార్ మహేశ్ బాబు భావోద్వేగంగా ట్వీట్ చేశారు. 71వ గణతంత్ర వేడుకల సందర్భంగా ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్ర బృందం హైదరాబాద్‌లోని భద్రతా బలగాలను కలిసింది. మహేశ్ సహా లేడీ అమితాబ్ విజయశాంతి, దర్శకుడు అనిల్ రావిపూడిలు కలిశారు. ఈ సినిమాలో మహేశ్ జవాన్‌గా నటించిన విషయం తెలిసిందే. గణతంత్ర వేడుకల సందర్భంగా చిత్ర చూనిట్ నిజమైన జవాన్లను కలవాలని భావించింది. 

ఈ సందర్భంగా జవాన్లను కలిసి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ ధైర్య, సాహసాలతో విధులు నిర్వర్తించే మన జవాన్లను కలవడం నాకు లభించిన గౌరవంగా భావిస్తున్నాను. మనల్ని ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడుతున్న భారత హీరోలకు సెల్యూట్ చేస్తూ.. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు’ అంటూ మహేశ్ ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, మహేశ్, విజయశాంతిలను కలిసి జవాన్లు సెల్ఫీలు దిగారు.