మాజీ భార్యలతో ఇలాగే ఉంటా : అమీర్ ఖాన్ - MicTv.in - Telugu News
mictv telugu

మాజీ భార్యలతో ఇలాగే ఉంటా : అమీర్ ఖాన్

March 14, 2022

fndfth

బాలీవుడ్ హీరో, పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ తన భార్యలతో తీసుకున్న విడాకులపై తొలిసారి స్పందించాడు. ఇవ్వాళ 57వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమీర్ పలు విషయాలను మీడియాతో పంచుకున్నారు. అందులో భాగంగా విడాకులపై స్పందిస్తూ.. ‘మా విడాకుల గురించి చెబితే ప్రజలు ఆశ్చర్యపోతారు. సాధారణంగా విడాకులు తీసుకున్న జంట ఆ తర్వాత మరొకరి గురించి పట్టించుకోరు. అంతేకాక, ఒకరికి మరొకరిపై కోపతాపాలు ఉంటాయి. కానీ మేం అలా కాదు. విడాకుల తర్వాత కూడా స్నేహంగా ఉంటున్నాం. నా ఇద్దరు మాజీ భార్యలు రీనా దత్తా, కిరణ్ రావులతో ఇప్పటికీ మంచి అనుబంధం ఉంది. వారితో కలిసి ఓ ఫౌండేషన్ స్థాపించాను. దాని కోసం ముగ్గురం కలిసి పని చేస్తున్నాం. అలాగే, పిల్లల విషయంలో తల్లిదండ్రులుగా మా బాధ్యతను నెరవేరుస్తున్నామ’ని వెల్లడించారు. కాగా, 1986లో రీనా దత్తాతో అమీర్ ఖాన్ మొదటి వివాహం జరిగింది.

2002లో విడిపోయారు. అనంతరం 2005లో కిరణ్ రావును రెండో వివాహం చేసుకుని 2021లో విడాకులు తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. తన మాజీ భార్య కిరణ్ రావు తన పుట్టిన రోజుకు మర్చిపోలేని బహుమతి పంపిందంటూ అమీర్ ఖాన్ ఓ ప్రశ్నకు సమాధానంగా బదులిచ్చారు. ‘ ఇటీవలే నా రెండో మాజీ భార్య కిరణ్ రావుతో మాట్లాడాను. నా బలహీనతల గురించి చెప్పమని కోరాను. ఆమె ఓ పది పాయింట్స్‌తో కూడిన ఓ జాబితా తయారు చేసిచ్చింది. అది నా జీవితంలో బెస్ట్ పుట్టిన రోజు కానుక’అంటూ స్పందించారు అమీర్ ఖాన్.