film industry, Actress, Neetu Chandra, bollywood, cinema news
mictv telugu

నెలకు 25 లక్షల జీతమిస్తా.. భార్యగా ఉండమన్నాడు : నటి నీతూ చంద్ర

July 14, 2022

బాలీవుడ్ నటి, హీరోయిన్ నీతూ చంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను శాలరీడ్ వైఫ్ (వేతనం తీసుకొని భార్యగా ఉండడం)గా ఉంటే నెలకు రూ. 25 లక్షల జీతమిస్తానని ఓ వ్యాపారవేత్త ఆఫర్ చేశాడని వెల్లడించింది. 13 జాతీయ అవార్డులు గెలుచుకున్న వారితో పనిచేసినప్పటికీ, తనకు ఇప్పుడు పని లేకుండా పోయిందనీ, చేతిలో డబ్బు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె పై వ్యాఖ్యలు చేసింది. 2005లో గరం మసాలా చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నీతూ చంద్ర ఆ తర్వాత వరుసగా చిత్రాలు చేసింది. ఆమె నటించిన ఓయ్ లక్కీ లక్కీ ఓయ్ చిత్రం అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రంగా, మిథిలా మఖాన్ అనే చిత్రం జాతీయ అవార్డు గెలుచుకుంది. అయితే ఆ తర్వాత నుంచి ఆమెకు అవకాశాల్లేవు. దీనిపై మాట్లాడుతూ..‘నాకథ సక్సెస్ అయిన నటికి ఉన్న విఫల కథ’ గా మారిపోయింది. పెద్ద సినిమాల్లో పనిచేసిన నాకు ఇప్పుడు పనిలేదు. నేను ఇక్కడ అనవసరంగా ఉన్నానేమోనని అనిపిస్తుంది’ అని పేర్కొంది. కాగా, నీతూ చంద్ర మన తెలుగు సినిమాల్లో కూడా నటించింది.