I have no relation with Devishri Prasad: Poojita
mictv telugu

దేవిశ్రీ ప్రసాద్‌తో సీక్రెట్ పెళ్లి..క్లారిటీ ఇచ్చిన పూజిత

September 4, 2022

టాలీవుడ్‌లో గతకొన్ని రోజులుగా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, నటి పూజిత పొన్నాడకు సంబంధించి, వీరిద్దరూ సీక్రెటుగా పెళ్లి చేసుకున్నారని సోషల్ మీడియలో ఓ వార్త తెగ చక్కర్లు కొట్టింది. వైరల్ అవుతున్న వార్తపై చాలామంది నెటిజన్స్ షాక్ అవుతూ, ‘దేవీశ్రీ ప్రసాద్ గారూ..మీరు సీక్రెటుగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటీ?’ అంటూ తెగ ట్రోల్ చేశారు. ఈ క్రమంలో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై నటి నటి పూజిత పొన్నాడ తీవ్రంగా మండిపడుతూ, దేవిశ్రీ ప్రసాద్‌తోనే కాదు, తనకు ఎవరితోనూ ఎటువంటి రిలేషిన్ షిప్ లేదని స్పష్టం చేసింది.

తాజాగా ఆమె ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలను వెల్లడించింది. ఇచ్చారు. “దేవిశ్రీతో నేను రిలేషన్లో ఉన్నట్లు వస్తోన్న వార్తలు అవాస్తవం. అసలు ఆ వార్తలు ఎలా పుట్టుకొచ్చాయో అర్ధం కావడం లేదు. మేమిద్దరం రహస్యంగా వివాహం చేసుకున్నామని అంటున్నారు. అది నిజం కాదు. ఆయనతోనే కాదు నేను ఎవరితోనూ రిలేషన్‌లో లేను. ప్రస్తుతానికి నేను సింగిల్. దయచేసి లేనివి క్రియేట్ చేయకండి” అంటూ ఆమె వేడుకుంది. అంతేకాదు, సోషల్ మీడియాలో గతకొన్ని రోజులుగా తనపై నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయని, వాటిని చూసినప్పుడు బాధగా అనిపిస్తుందని వాపోయారు.

ఇక, పూజిత పొన్నాడ విషయానికొస్తే..విశాఖకు చెందిన ఆమె ‘ఊపిరి’తో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఇందులో ఆమె చిన్న పాత్ర పోషించారు. ఆ తర్వాత ‘రంగస్థలం’, ‘బ్రాండ్ బాబు’, ‘హ్యాపీ వెడ్డింగ్, ‘మిస్ ఇండియా’, ‘ఓదెల రైల్వేస్టేషన్’ వంటి చిత్రాల్లో ఆమె నటించినప్పటికీ అనుకున్నంత గుర్తింపు సొంతం చేసుకోలేకపోయారు. ప్రస్తుతం ‘ఆకాశ వీధుల్లో’ అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ యూట్యూబ్ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది.