I have not received any notices from ED : Kavitha
mictv telugu

నాకెలాంటి నోటీసులు రాలేదు : కవిత

September 16, 2022

 

ఢిల్లీ మద్యం కుంభకోణంలో శుక్రవారం ఈడీ అధికారులు హైద్రాబాద్‌లో సోదాలు నిర్వహించి విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవిత పర్సనల్ ఆడిటర్, అకౌంటెంట్ ఇళ్లల్లో సోదాలు నిర్వహించినట్టు వార్తలు వచ్చాయి. అంతేకాక, కవితకు ఈడీ నోటీసులిచ్చిందని, కరోనా సోకి క్వారంటైన్‌లో ఉండడంతో ఆమె సహాయకులకు నోటీసులిచ్చినట్టు వచ్చిన వార్తలపై కవిత స్పందించారు. తనకు ఈడీ ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని స్పష్టం చేశారు. కొందరు ఢిల్లీలో కూర్చుని దురుద్దేశంతో మీడియాను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. మీడియా సంస్థలు కూడా తమ విలువైన సమయాన్ని నిజాలను చెప్పడానికి వినియోగించాలని హితవు పలికారు. టీవీ ప్రేక్షకుల విలువైన సమయానికి మీడియా సంస్థలు తగిన గౌరవమివ్వాలని సూచించారు. తనకెలాంటి నోటీసులు రాలేదని చెప్పడానికి ఈ అంశంలో స్పందించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.