కలెక్షన్లతో నాకు సంబంధం లేదు : ఎన్టీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

కలెక్షన్లతో నాకు సంబంధం లేదు : ఎన్టీఆర్

March 30, 2022

‘ఆర్ఆర్ఆర్’లో తన పాత్ర గురించి ఎన్టీఆర్ మరోసారి స్పందించారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ఇకపై నా కెరీర్ ఆర్ఆర్ఆర్ కంటే ముందు, ఆ తర్వాత అని మాట్లాడుకుంటారని అభిప్రాయపడ్డారు. ‘ నా ఇంట్రడక్షన్ సీన్స్ చాలా బాగున్నాయని అందరూ మెచ్చుకుంటున్నారు. చాలా మంది ప్రేక్షకులు ఆ సీన్లను తమ ఫోన్లలో రికార్డు చేసుకొని యూట్యూబులో పెడుతున్నారు. అంత మంది నాడి పట్టుకోవడం రాజమౌళికి ఎలా సాధ్యమైందా? అని ఆలోచిస్తున్నా. సినిమా కోసం శారీరకంగా చాలా శ్రమపడ్డా. కొమురం భీం పాత్రలో నటించినందుకు గర్వపడుతున్నా’నని వెల్లడించారు. భారీగా వస్తున్న వసూళ్ల గురించి ప్రశ్నించగా.. ‘ ఒక నటుడిగా ముందుగా ప్రశంసలకు ప్రాధాన్యమిస్తా. తర్వాత రివ్యూలలో నా పైన వచ్చే విశ్లేషణలను చదువుతా. వసూళ్లతో నాకెలాంటి సంబంధం ఉండదు. అయితే తెలుసుకోవడం వల్ల మాకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంద’ని వ్యాఖ్యానించారు.