రమ్య వసూళ్లకు..నాకు ఏ సంబంధం లేదు: నరేశ్ - MicTv.in - Telugu News
mictv telugu

రమ్య వసూళ్లకు..నాకు ఏ సంబంధం లేదు: నరేశ్

February 23, 2022

naresh

తెలుగు సీనియర్‌ నటుడు నరేశ్‌ మాజీ భార్య రమ్య రఘుపతికి సంబంధించిన ఆర్ధిక లావాదేవీలకు తనకు ఎలాంటి సంబంధం లేదని నరేశ్ స్పష్టం చేశారు. నరేశ్ మాట్లాడుతూ.. “ఈ మొత్తం వ్యవహారంతో నాకు ఏ సంబంధం లేదు. ఏడెళ్ల నుంచి నేను, ఆమె దూరంగా ఉంటున్నాం. ఈ వ్యవహారం గురించి నా బంధువులు, మీడియా మిత్రులు ఫోన్స్ కాల్స్ చేసి అడుగుతున్నారు. మా వివాహమై తొమ్మిది సంవత్సరాలు అయింది. రమ్య ఈ విధంగా అప్పులు చేస్తోందని తెలిసి, భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని ఊహించి, ఏడు సంవత్సరాల నుంచి ఆమెకు దూరంగా ఉంటున్నారు. మా జీవితాలు మేము జీవిస్తున్నాం. ప్రస్తుతం మా ఇద్దరికీ ఎలాంటి సంబంధం లేదు” అని నరేష్ అన్నారు.

మరోపక్క రంభ ఉన్నతి అరోమా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు రమ్య తమ వద్ద నుంచి అప్పులు తీసుకొని ఇప్పటివరకూ తిరిగి ఇవ్వలేదని మంగళవారం బాధితులు పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే.