నాకు ఆ అలవాటు ఉంది: కేజీఎఫ్ డైరెక్టర్ - MicTv.in - Telugu News
mictv telugu

నాకు ఆ అలవాటు ఉంది: కేజీఎఫ్ డైరెక్టర్

April 13, 2022

kgf

కన్నడ చిత్రసీమ పరిశ్రమలో ‘కేజీఎఫ్ పార్ట్ 1’ చిత్రం ఎంతంటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌పై దేశవ్యాప్తంగా ప్రముఖులు ప్రశంసల వర్షాన్ని కురిపించారు. సినిమాను చిత్రకరించిన విధానం గాని, హీరో చెప్పే డైలాగులు గాని, యాక్షన్ గాని, పాటలు గాని యావత్ సినీ ప్రియులను కట్టిపడేశాయి. అయితే, ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషలలో ‘కేజీఎఫ్ 2’ చిత్రం విడుదల కాబోతుంది. ఈ చిత్రానికి సంబంధించి హీరో, హీరోయిన్, డైరెక్టర్ ప్రమోషన్స్ భారీగా చేస్తున్నారు. పలు ఛానెల్స్‌కు ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

ఈ నేపథ్యంలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. ”నాకు మద్యం తాగే అలవాటు ఉంది. నేను మద్యాన్ని తాగుతూనే కథలు రాస్తుంటాను. ఎంత మత్తు ఎక్కిన కథను మాత్రం స్పష్టంగా రాసుకుంటాను. సినిమాను కూడా అదే విధంగా తీస్తాను. ఏ సన్నివేశాం అవసరం? ఏదీ అనవసరం? అనేది నాకు నేనే నిర్ధారించుకుంటాను” అని అన్నారు. ఇక్కడ కథ గురించి కాదు, దాన్ని ఎలా ప్రజెంట్‌ చేస్తున్నామనేది అత్యంత ముఖ్యమైన టాస్క్‌ అని ప్రశాంత్ నీల్ తెలిపారు. ఈ మూవీలో రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, సంజయ్ దత్ కీలకమైన పాత్రలు పోషించారు.