I have to do this movie: Nagarjuna
mictv telugu

ఈ సినిమా నేను చేయాల్సింది: నాగార్జున

August 12, 2022

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా, మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా, రష్మికా మందన్న కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం ‘సీతారామం’. ఈ సినిమాను తెలుగు దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించారు. గతవారం ఈ సినిమా తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో విడుదలై, ప్రేక్షకుల మదిని దోచుకుంది. సినిమాను వీక్షిస్తున్న ప్రతి ప్రేక్షకుడు చాలా రోజుల తర్వాత ఓ చక్కటి సినిమాను చూశామంటూ తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

ఈ క్రమంలో గురువారం రాత్రి హైదరాబాద్‌లో ‘సీతారామం’ సక్సెస్ మీట్‌ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ఓ సంచలన విషయాన్ని వెల్లడించారు. ‘‘సీతారామం’ సినిమా నేను చేయాల్సింది. దుల్కర్ కొట్టేశాడు’ అని నాగార్జున నవ్వుతూ చెప్పాడు.

నాగార్జున మాట్లాడుతూ..” మంచి సినిమా తీస్తే చూస్తామనే నమ్మకం ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు పాదాభివందనాలు. మంచి సినిమా అందించి అశ్వనీదత్‌గారు థియేటర్‌కి మళ్లీ ప్రేక్షకులను తీసుకొచ్చి, మా అందరికీ మరోసారి నమ్మకం కలిగించారు. ‘సీతారామం’లాంటి సినిమా తీయడానికి ధైర్యం కావాలి. స్వప్న, ప్రియాంకలు అశ్వనీదత్‌గారికి పెద్ద అండగా నిలుస్తున్నారు. ‘మహానటి, జాతిరత్నాలు, సీతారామం’ వంటి హిట్‌ చిత్రాలు నిర్మించారు. ‘సీతారామం’ చూసి అసూయపడ్డాను. నాకు రావాల్సిన రోల్‌ దుల్కర్‌కి వెళ్లింది” అని ఆయన అన్నారు.