నాకు ఆ హీరోయిన్ అంటే ఇష్టం, ఒక్కసారైనా... యశ్ - MicTv.in - Telugu News
mictv telugu

నాకు ఆ హీరోయిన్ అంటే ఇష్టం, ఒక్కసారైనా… యశ్

April 21, 2022

yyyy

‘కేజీయఫ్-2’ హీరో యశ్ (రాకీ భాయ్) తన మనసులోని మాటలను బయటపెట్టాడు. ఫలానా హీరోయిన్ అంటే ఇష్టమని, ఆమె నటన చాలా బాగుంటుందని వెల్లడించాడు. దీంతో యశ్ అభిమానులు ఆ హీరోయిన్ ఎవరు? అనే విషయాన్ని తెలుసుకోవడానికి తెగ సెర్చ్ చేస్తున్నారు.

యశ్‌ తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ”నా ఫేవరెట్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణె. ఆమెతో ఒక్కసారైనా స్క్రీన్‌ షేర్‌ చేసుకోవాలని ఎదురుచూస్తున్నా. దీపిక నటన ఎంతో బావుంటుంది. ఆమె నటించే ప్రతి సినిమాను చూస్తాను” అని యశ్‌ చెప్పుకొచ్చాడు.

మరోపక్క యశ్ బాక్సాఫీస్‌ రికార్డులను బద్దలు కొడుతున్నాడు. ఏప్రిల్‌ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘కేజీయఫ్-2’ చిత్రం.. టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్, శాండిల్‌వుడ్ అనే తేడా లేకుండా దూసుకుపోతోంది.  ఇక, ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు హీరో యశ్‌, దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.