నాకు విజయ్ అంటే చాలా ఇష్టం: రష్మిక - MicTv.in - Telugu News
mictv telugu

నాకు విజయ్ అంటే చాలా ఇష్టం: రష్మిక

May 25, 2022

“గొప్ప నటులైన విజయ్, అమితాబ్ వంటి స్టార్స్‌తో నటించే అవకాశం నాకు ఆ దేవుడి దయ వల్లే లభించింది. అందుకు నేనెంతో గర్వంగా ఫీలవుతున్నా, నేను వారితో చేస్తోన్న కథలు అద్భుతంగా ఉన్నాయి. వాళ్ల నుంచి ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకుంటున్నా. ప్రతి సినిమాతో మరింత మెరుగైన నటిగా మారుతున్నా. దళపతి విజయ్ అంటే నాకెప్పటి నుంచో అభిమానం, నా చిన్నప్పటి నుంచి ఆయనే నా హీరోగా ఎంచుకున్నా. అప్పటినుంచి నా అభిమాన హీరోగా ఆయనంటే నాకు చాలా ఇష్టం. మొదటిసారి ఆయన్ని కలిసిన ఆ క్షణాన్ని ఎప్పటికీ మర్చిపోను. సినిమా పూజా కార్యక్రమం సమయంలో టెన్షన్‌తో ఆయన్ని అలా చూస్తూ ఉండిపోయా. ఆయనకి దిష్టి తీశాను. నేను అలా చేస్తుంటే ఆయన ఆశ్చర్యపోతూ అలానే చూస్తూ ఉండిపోయారు. ఇక సెట్లో ఉన్న వాళ్లందరూ గట్టిగా నవ్వారు” అని రష్మిక అన్నారు.

తాజాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలో రష్మిక హీరోయిన్‌గా విజయ్ పక్కన నటించబోతుంది. ఈ సినిమాకు సంబంధించి ఇటీవలే ఆమె ఓ ఆంగ్ల ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యక్తిగతంగా ఏ హీరో అంటే మీకూ ఇష్టమని యాంకర్ అడిగిన ప్రశ్నకు రష్మిక తమిళ స్టార్ విజయ్ గురించి తన మనసులోని మాటలను బయటపెట్టింది. ప్రస్తుతం రష్మిక తెలుగులో పుష్ప-2లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్‌లలో వరుసగా పలు సినిమాలు చేస్తూ, రష్మిక దూసుకుపోతోంది.