చిలిపి దొంగ.. 20 లక్షల సొమ్ము ఎత్తుకెళ్లి ఆ మెసేజ్ పెట్టాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

చిలిపి దొంగ.. 20 లక్షల సొమ్ము ఎత్తుకెళ్లి ఆ మెసేజ్ పెట్టాడు..

May 25, 2022

దొంగలు చేతికందినకాడికి ఎత్తుకెళ్లి, ష్ గప్‌చుప్‌గా ఉంటారు. కొందరు దొంగలు టార్గెట్ చేసుకున్న ఇంట్లో సొమ్ములేవీ లేకపోతే పేపరుపై చెడామడా తిట్లు రాసి కూడా వెళ్తుంటారు. దొంగల ఎమోషన్స్ దొంగలవి. 20 లక్షలకుపైగా ఖరీదైన నగలను కాజేసిన దొంగ వెళ్తూ వెళ్తూ ఇంటి యజమానిని ఉద్దేశించి ‘ఐ లవ్ యూ’ అని టీవీ స్క్రీన్‌పై చక్కగా రాసిపెట్టి పోయాడు. గోవాలోని ఈ తతంగం జరిగింది. అసిబ్ జెక్ అనే వ్యక్తి ఏదో విహారయాత్రకు వెళ్లడంతో అదను చూసి దొంగలు పడ్డాడరు. మంగళవారం ఇంటికొచ్చి చూసిన అసిబ్ లబోదిబోమన్నాడు. ఏమేం పోయాయోనని చూస్తుండగా టీవీ స్క్రీన్‌పై ‘ఐ లవ్ యూ’ అని మార్కర్ పెన్నుతో రాసి ఉండడం కనిపించింది. 20 లక్షల విలువైన బంగారు, వెండి నగలతోపాటు రూ. 1.50 లక్షల నగదును కూడా దొంగలు పట్టుకెళ్లారు. అసిబ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.