నేను పొరపాటు చేశా, తప్పు నాదే: హర్భజన్ సింగ్ - MicTv.in - Telugu News
mictv telugu

నేను పొరపాటు చేశా, తప్పు నాదే: హర్భజన్ సింగ్

June 6, 2022

”నేను పొరపాటు చేశా. తప్పు నాదే. నా వల్ల సహచరుడు ఇబ్బంది పడాల్సి వచ్చింది. నేనూ సిగ్గుపడ్డాను. నేను ఒక తప్పును సరిదిద్దుకోవాల్సి వస్తే అది మైదానంలో శ్రీశాంత్‌తో నేను ప్రవర్తించిన తీరే. ఆ సంఘటన గురించి ఆలోచించిన ప్రతిసారి అలా జరగాల్సింది ఉండకూడదు అనిపిస్తుంది” అని టీమ్ ఇండియా మాజీ ఆటగాడు హర్భజన్‌సింగ్ అన్నాడు.

ఈ వ్యాఖ్యలు ఎందుకు అన్నారు? ఏం జరిగింది? ఎప్పుడు జరిగింది? అని సందేహం మీకూ రావచ్చు. అదేనండి. భారత టీ20 లీగ్ 2008 ఆరంభ సీజన్లో ముంబై తరుపున హర్బజన్ సింగ్, పంజాబ్ తరఫున శ్రీశాంత్ ప్రాతినిధ్యం వహించారు. మొహాలీలో జరిగిన మ్యాచ్‌లో ముంబైపై పంజాబ్ గెలించింది. అయితే, ఆ మ్యాచ్ అనంతరం ఆటగాళ్లు కరచాలనం చేసుకునే టైంలో శ్రీశాంత్‌ను హర్బజన్ సింగ్ చెంప మీద గట్టిగా ఓ దెబ్బ కొట్టాడు. ఇక అంతే ఎందుకు కొట్టాడు? కారణం ఏంటో తెలీదు గాని అప్పట్లో ఆ ఘటన కలకలం రేపింది.

ఈ క్రమంలో తాజాగా హర్బజన్ సింగ్ ఆ ఘటనను గుర్తుచేస్తూ స్పందించారు. ఆరోజు శ్రీశాంత్‌ను అలా కొట్టాల్సి కాదు అంటూ తెలియజేశాడు. ”అప్పుడు ఏదైతే జరిగిందో అది ముమ్మాటికీ తప్పే. నేను తప్పు చేశాను. నా వల్ల నా తోటి క్రీడాకారుడు సిగ్గుపడాల్సి వచ్చింది. నన్నూ సిగ్గుపడేలా చేసింది. తప్పంతా నాదేనని ఒప్పుకుంటున్నాను. నేను సరిదిద్దుకోవాల్సిన తప్పు ఏదైనా ఉందంటే.. అది మైదానంలో శ్రీశాంత్‌పై నేను ప్రవర్తించిన తీరే” అని ఆయన అన్నారు.

మరోపక్క భజ్జీతో తనకిప్పుడు ఎలాంటి విభేదాలు లేవని గతంలో ఓ ఇంటర్వ్యూలో శ్రీశాంత్ చెప్పాడు. సచిన్ టెండూల్కర్ ఇద్దరికీ విందు ఏర్పాటు చేసి ఆ వివాదం సద్దుమణిగేలా చేశాడని, అందుకు సచిన్‌కు ఎప్పటికీ రుణ పడి ఉంటానని హర్భజన్ సింగ్ అన్నాడు. కానీ, ఆ ఘటనను మీడియా మాత్రం వేరే లెవెల్‌కు తీసుకెళ్లిందని చెప్పుకొచ్చారు.