నాకు ఆమె అంటే చాలా ఇష్టం: నాని - MicTv.in - Telugu News
mictv telugu

నాకు ఆమె అంటే చాలా ఇష్టం: నాని

June 6, 2022

టాలీవుడ్ నేచురల్ స్టార్ హీరో నాని తనకు ఇష్టమైన హీరోయిన్ ఆమెనంటూ తన మనసులోని పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు. నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘అంటే సుందరానికీ’. ఈ సినిమాకు సంబంధించి ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, పలు విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

‘చదువుకునే రోజుల్లో తనకు ఇంగ్లీష్ సరిగా వచ్చేది కాదు.కానీ, ఇంగ్లీష్‌లో మార్కులు మాత్రం ఎక్కువ మార్కులు వచ్చేవి. ప్రతి ప్రశ్నకు ‘టైటానిక్’ సినిమా కథ రాసేవాడివి. అందుకే మార్కులు పడిపోయేవి. పరీక్షలంటే నాకు చాలా భయం.అందుకే పరీక్షలకు షూస్‌లో స్లిప్పులు పెట్టుకుని వెళ్లేవాడిని. రెండు, మూడు సార్లు దొరికిపోయా.. కానీ, అదృష్టం బాగుండి డీబార్ కాలేదు. చదువుల్లో నేను బెస్ట్ స్టూడెంట్ కాదు. ఒకసారి అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యా. నాన్న చూస్తే తిడతారనే భయంతో ప్రోగ్రెస్ రిపోర్ట్‌లో నేనే సంతకం చేశా” అని ఆయన అన్నారు.

అనంతరం యాంకర్ సినిమా పరంగా ఏ హీరో, హీరోయిన్ అంటే చాలా ఇష్టం అని అడుగగా.. దానికి నాని ‘నాకు అమితాబ్ బచ్చన్, విద్యాబాలన్ అంటే చాలా చాలా ఇష్టం. అవకాశం వస్తే వారితో ఒక సీన్‌లో అయినా నటించాలని ఉంది’.’నేను లోకల్’ సినిమాలో కొన్ని సీన్లు నా జీవితంలో జరిగినవే’ అని సమాధానం చెప్పారు.

ఇక, ‘అంటే సుందరానికీ’ మూవీ విషయానికొస్తే.. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో కథనాయకుడిగా నాని, కథనాయికగా మలయాళ నటి నజ్రియా నజీమ్‌ నటిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం వివేక్ సాగర్ అందించారు. జూన్ 10వ తారీఖున  ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అయ్యింది.