కర్ణాటకలో శుక్రవారం నాలుగు స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. ఈ క్రమంలో కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే శ్రీనివాస గౌడ క్రాస్ ఓటింగ్‌కి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మీడియాకు వెల్లడించడం విశేషం. ఇలా ఎందుకు చేశారని అడిగితే..‘కాంగ్రెస్ పార్టీ అంటే నాకు ఇష్టం. అందుకే వేశా’నని బదులివ్వడంతో మీడియా వారు షాకయ్యారు. గతంలో ఈయన కాంగ్రెస్‌లో చేరతానని ప్రకటించారు కూడా. ఈ ఘటనపై కుమరస్వామిని వివరణ కోరగా, క్రాస్ ఓటింగ్ నిజమేనని ఒప్పుకున్నారు. మతతత్వ పార్టీ అయిన బీజేపీని ఓడించడానికి తమకు మద్ధతివ్వమని కాంగ్రెస్‌ను అడిగితే ఇవ్వకుండా బీజేపీ మరింత బలపడేలా వ్యవహరించిందని మండిపడ్డారు. కాంగ్రెస్ నేత సిద్ధ రామయ్య ద్రోహానికి పాల్పడ్డారని విమర్శించారు. దీంతో రాజ్యసభలో జేడీఎస్ బలం 32 నుంచి 30కి తగ్గినట్టయింది.