.i want to marry Nityanandaswamy..
mictv telugu

నిత్యానందస్వామిని పెళ్లి చేసుకుంటా.. ఆయన దగ్గర మస్తు..

July 9, 2022

i want to marry Nityanandaswamy..

”ఎవరు ఏమీ అనుకున్నా నేను మాత్రం నిత్యానందస్వామినే పెళ్లి చేసుకుంటా. ఆయన దగ్గరకు వేలాది మంది భక్తులు వస్తారు. ఆయనను ఇప్పటికి మస్తు మంది ఆరాధిస్తున్నారు. అటువంటి గొప్ప వ్యక్తిని పెళ్లి చేసుకుంటే, నాపేరు గాని, నా ఇంటిపేరు గాని మార్చుకోవలసిన అవసరం కూడా ఉండదు” అని ప్రముఖ హీరోయిన్ ప్రియా ఆనంద్ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తెగ వైరల్ అవుతున్నాయి. మరి ఎవరు ఈ ప్రియా ఆనంద్? ఎందుకు స్వామీజీ నిత్యానందను పెళ్లి చేసుకుంటా అన్నది? అనే వివరాల్లోకి వెళ్తే…

ప్రియా ఆనంద్.. భారతీయ తమిళ సినీ నటి. 2009లో నటుడు జై నటించిన “వామనన్” చిత్రంతో తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టింది. తమిళంతోపాటు, తెలుగు, హిందీ వంటి చిత్రాల్లో నటించి, తన అందంతో ప్రక్షకులను ఆకట్టుకుంది. ఆమె చివరిసారిగా ఆర్డే బాలాజీ నటించిన ‘ఎల్కేజీ’ చిత్రంలో నటించారు. ప్రస్తుతం ‘అందగన్’, సుమో’, ‘కాసేతన్’, ‘కోడుడా’ వంటి పలు చిత్రాల్లో నటిస్తున్నారు. అయితే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె పాల్గొంది. యాంకర్ మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? ఎవరిని చేసుకుంటారు? అనే అడిగితే దానికి ఆమె నిత్యానందస్వామిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నట్లు మనసులోని మాటను బయటపెట్టింది.

ఇక, స్వామీజీ నిత్యానంద విషయానికొస్తే.. వివాదాలు, అత్యాచారం వంటి పలు ఆరోపణలతో ఆయన భారతదేశాన్ని విడిచి పారిపోయారు. సొంతంగా ఓ దేశాన్నే ఏర్పాటు చేసుకొని, ఈక్వెడార్ నుంచి ఒక చిన్న ద్వీపాన్ని కొనుగోలు చేసిన ఆయన..దానికి ‘కైలాస’ అనే పేరు పెట్టుకున్నారు. అంతేకాదు తమది ప్రత్యేక దేశమంటూ ప్రకటించుకున్నారు. ప్రత్యేక కరెన్సీని కూడా తయారు చేశారు. తమ దేశంలో అడుగుపెట్టాలంటే వీసా ఉండాల్సిందేనని ప్రకటించారు. అయితే, ఆయన చుట్టూ ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా, ఆయనపై విశ్వాసం వ్యక్తం చేసేవారు, మనసు పారేసుకునేవారు, ఆయన అంటే పడి చచ్చిపోయేవారు భారత్‌లో ఇంకా ఉన్నారట. అప్పట్లో ఓ హీరోయిన్లో ఆయనతో గడిపిన వీడియోలను బయటపెట్టడంతో సంచలనంగా మారాయి. ఇప్పుడు నిత్యానందుడిపై మరో హీరోయిన్ మనసుపారేసుకోవటం హాట్ టాఫిక్‌గా మారింది.

మరోపక్క ప్రియా ఆనంద్ వ్యాఖ్యలపై నెటిజన్స్ స్పందిస్తూ, ‘నువ్వు కేవలం డబ్బు కోసమే అతనికి కనెక్ట్ అయ్యావు. హీరోయిన్స్ అంతా వ్యాపారవేత్తలకు, బాబాలనే పెళ్లి చేసుకుంటారు. ఎందుకంటే వారి దగ్గర ఆస్తి, డబ్బు, బంగారం, అంతస్థులు ఉంటాయి కదా’ అంటూ కామెంట్స్ మీద కామెంట్స్ చేస్తున్నారు.