బాలయ్యకు ముద్దు పెట్టాలనిపించింది - యంగ్ హీరో - MicTv.in - Telugu News
mictv telugu

బాలయ్యకు ముద్దు పెట్టాలనిపించింది – యంగ్ హీరో

June 3, 2022

యువరత్న నందమూరి బాలకృష్ణపై ఓ యంగ్ హీరో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనను ముద్దు పెట్టుకోవాలనిపించిందని మీడియా ముఖంగా చెప్పేశాడు. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచండ్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్నవిషయం తెలిసిందే. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రుతి హాసన్ కథానాయిక. ఇందులో యువ నటుడు నవీన్ చంద్ర కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కొన్ని సందర్భాల్లో బాలయ్యను ముద్దు పెట్టుకోవాలనిపించేదని వెల్లడించారు. ఆయన లాంటి హీరోను ఇంతవరకు చూడలేదని, ఆయనతో కలిసి పని చేయడం మంచి అనుభవమని చెప్పుకొచ్చారు. అయితే షూటింగ్ సమయంలో ఆయనతో ట్రావెల్ చేసేటప్పుడు చాలా ముద్దొచ్చేవారని తెలిపాడు.