నేనూ మీటూ బాధితుడినే... సైఫ్ అలీఖాన్... - MicTv.in - Telugu News
mictv telugu

నేనూ మీటూ బాధితుడినే… సైఫ్ అలీఖాన్…

October 15, 2018

సినిమా రంగంలో లైంగిక వేధింపులు మహిళల మీదే కాదు పురుషుల మీద కూడా జరుగుతున్నాయని అక్కడొకరు, ఇక్కడొకరు అన్నట్టు బయటకు వస్తున్నారు. తాజాగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ మీటూ ఉద్యమానికి మద్దతు పలుకుతూ, గతంలో తనపై జరిగిన వేధింపుల గురించి చెప్పాడు.I was harassed 25 years ago and I'm still angry about it: Saif Ali Khan joins the MeToo movement ‘25 ఏళ్ల క్రితం చిత్ర పరిశ్రమలో నేనూ వేధింపులు ఎదుర్కున్నాను. కానీ అవి లైంగికపరమైనవి కావు. అయినప్పటికీ నేను ఎదుర్కున్న వేధింపుల గురించి తలుచుకుంటే ఒళ్లు మండిపోతుంది. సమాజంలో చాలా మంది ఇతరులను అర్థం చేసుకోరు. అలాంటివారికి ఇతరుల బాధలను అర్థం చేసుకోవడం చాలా కష్టం. నేను ఎదుర్కున్న వేధింపుల గురించి చెప్పదలచుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు నేను అంత ముఖ్యమైన వ్యక్తిని కాను. కానీ నాపట్ల జరిగిన ఘటనలు తలచుకుంటే కోపం కట్టలు తెంచుకుంటుంది. ఇక నుంచి మనం మహిళలను జాగ్రత్తగా చూసుకోవాలి. నా ముందు  ఎవరైనా ఓ మహిళ పట్ల తప్పుగా ప్రవర్తిస్తే ఊరుకోను. సినీ పరిశ్రమలో ఇప్పటివరకు ‘మీటూ’ ఉద్యమంలో ఎవరి పేర్లు బయటకు వచ్చాయో, వారితో కలిసి ఇకపై పని చేయను’ అని సైఫ్ స్పష్టం చేశాడు.