I was kidnapped by four girls
mictv telugu

నన్ను నలుగురు పెద్దింటి అమ్మాయిలు గ్యాంగ్ రేప్ చేశారు

November 23, 2022

I was kidnapped by four girls

దేశవ్యాప్తంగా మహిళలు, యువతులు, బాలికలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతుండడాన్ని మనం రోజూ చూస్తూనే ఉన్నాం. కానీ పంజాబ్ లో ఇందుకు విరుద్ధంగా జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ అమాయక యువకుడిని నలుగురు అమ్మాయిలు కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేశారు. అర్ధరాత్రి తిరిగి రోడ్డుపై వదిలేసి వెళ్లిపోగా ఎలాగోలా బాధితుడు ఇంటికి చేరుకొని జరిగిందంతా భార్యకు చెప్పాడు. పెళ్లాం పిల్లలు ఉండడంతో పరువు కోసం పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.

I was kidnapped by four girls

కానీ భార్య బలవంతం చేయడంతో స్థానిక మీడియా ముందుకు వచ్చి తన గోడు వెళ్లబోసుకున్నాడు. ‘కూలీ పనులు చేసుకుంటున్న నేను సోమవారం పని ముగిశాక కపుర్తలా రోడ్డులో ఇంటికి వస్తున్నాను. ఆ సమయంలో ఓ తెల్ల కారు వచ్చి ఆగింది. అడ్రస్ చెప్పమంటూ ఓ చీటీ అందించి కళ్లలో ఏదో కెమికల్ చల్లడంతో మత్తుతో కళ్లు మూసుకుపోయాయి. ఆపై నన్ను కారులోకి ఎక్కించి కాళ్లు చేతులు కట్టేసి ప్రతిఘటించే వీలు లేకుండా చేసి కళ్లకు గంతలు కట్టేశారు. ఓ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ఏవో ఇంజక్షన్లు ఇచ్చి బలవంతంగా మందు తాగించారు. ఆపై నలుగురు అమ్మాయిలు అఘాయిత్యానికి పాల్పడ్డారు. అర్దరాత్రి నన్ను రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. వాళ్లంతా పెద్దింటి అమ్మాయిల్లా ఉన్నారు. ఇంగ్లీషుతో పాటు పంజాబీ మాట్లాడార’ని వాపోయాడు. ఈ వ్యవహారం తీవ్ర చర్చకు దారి తీయడంతో పోలసులు సుమోటోగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.