నన్ను అరెస్ట్ చేయలేదు, నేనే తప్పూ చేయలేదు.. జీవిత - MicTv.in - Telugu News
mictv telugu

నన్ను అరెస్ట్ చేయలేదు, నేనే తప్పూ చేయలేదు.. జీవిత

April 23, 2022

గరుడ వేగ సినిమా కోసం రూ. 26 కోట్లు ఎగ్గొట్టారన్న వార్తలు వచ్చిన నేపథ్యంతో నటి, దర్శకురాలు జీవిత ఆ ఆరోపణలకు వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఆమె శనివారం మీడియాతో మాట్లాడారు. ‘ఈ కేసు ఏడాది నుంచి నగరి కోర్టులో నడుస్తోంది. ఇంతకు ముందు కూడా నాపై వారెంట్ జారీ అయ్యింది. తాజాగా సమన్లు వచ్చిన మాట వాస్తవమే కానీ, నేను అరెస్ట్ కాలేదు.

అయినా ఆ కేసును నేనే గెలిచాను. వారు ఇప్పుడే మీడియా ముందుకు ఎందుకు వచ్చారో అర్ధం కావట్లేదు. రూ. 26 కోట్లు మోసం చేశానని జోష్టర్ ఫిలిం సర్వీసెస్ అధినేత కోటేశ్వర్రావు అంటున్నారు. అవి ఏ కోట్లో తెలియట్లేదు. ఆయన చేసేనవన్నీ తప్పుడు ఆరోపణలు. ఆయన తీరు వల్ల మా మేనేజర్లు ఇబ్బంది పడ్డారు’ అని వ్యాఖ్యానించారు. కాగా, జీవిత దర్శకత్వంలో రాజశేఖర్ నటించిన ‘శేఖర్’ చిత్రం మే 20న థియేటర్లలో విడుదల కానున్నట్టు జీవిత వెల్లడించారు.