తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి స్వయంభూ దర్శన ప్రారంభోత్సవ కార్యక్రమానికి తనను పిలవలేదని స్థానిక ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను, నాయకులను మాత్రమే ఆహ్వానించారని మండిపడ్డారు. స్థానిక ఎంపీని తనను పిలవకపోవడమేంటని ప్రశ్నించారు. ఈ విషయంలో సీఎం కార్యలయం ప్రోటోకాల్ పాటించలేదని, ఉద్దేశ పూర్వకంగానే ఇది జరిగుంటుందని భావిస్తున్నానన్నారు. దేవుడి దగ్గర ఇలాంటి నీచ రాజకీయాలు చేయడం ముఖ్యమంత్రి కేసీఆర్కు తగదని హితవు పలికారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. కాగా, సీఎం కేసీఆర్ దంపతులు సుదర్శన చక్రానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూజారులు కంకణధారణ చేసి ఆశీర్వచనం అందించారు.