గే అయినందుకే జడ్జిగా ప్రమోషన్ ఇవ్వట్లేదు.. సీనియర్ న్యాయవాది - MicTv.in - Telugu News
mictv telugu

గే అయినందుకే జడ్జిగా ప్రమోషన్ ఇవ్వట్లేదు.. సీనియర్ న్యాయవాది

November 17, 2022

సీనియర్ న్యాయవాది సౌరభ్ కిర్పాల్ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను గే అయినందుకే జడ్జీగా ప్రమోషన్ ఇవ్వట్లేదని ఆరోపించారు. నన్ను నేను బహిరంగంగా స్వలింగ సంపర్కుడినని ప్రకటించడమే కారణమని అభిప్రాయపడ్డారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు మాట్లాడారు. ఒక గేను న్యాయమూర్తిగా నియమించేందుకు కేంద్రం సిద్ధంగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

జడ్జీల నియామకాల ప్రక్రియపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో సౌరభ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా, సౌరభ్‌ని జడ్జీగా ప్రమోట్ చేయాలని 2017లోనే ప్రతిపాదనలు పంపారు. కానీ ఇప్పటివరకు ఆమోదం రాలేదు. కేంద్రమే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఒకవేళ జడ్జీగా నియమిస్తే తొలి ఆ పదవి చేపట్టిన తొలి స్వలింగ సంపర్క వ్యక్తిగా చరిత్రలోకెక్కుతారు.