I was offered Rs 50 crore: Shiv Sena MLA
mictv telugu

రూ. 50 కోట్ల ఆఫరిచ్చారు.. కారు నిండా డబ్బులే : ఎమ్మెల్యే

June 27, 2022

శివసేన పార్టీలో తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో ఆ పార్టీ కన్నాడ్ ఎమ్మెల్యే ఉదయ్ సింగ్ రాజ్‌పుత్ ఆదివారం సంచలన ఆరోపణలు చేశారు. ‘అసమ్మతి ఎమ్మెల్యేలతో కలిసి చేరడానికి గౌహతి వెళ్లేందుకు తనకు రూ. 50 కోట్ట డబ్బు ఆశ చూపారని వెల్లడించాడు. పదేపదే ఫోన్లు చేసి బలవంతం చేయడంతో విసుగొచ్చి స్విచ్ఛాఫ్ చేసుకున్నానన్నాడు. తర్వాత కొంతమంది వ్యక్తులు కారులో వచ్చి కారు నిండా డబ్బుంది తీసుకోండి అని చెప్పడంతో వారికి గట్టి సమాధానం ఇచ్చానని తెలిపాడు. థాకరే ఫ్యామిలీ, శివసేనలకు ఎప్పుడూ విధేయుడిగా ఉంటానని కరాఖండీగా చెప్పేశానని వివరించాడు. అటు అసమ్మతి ఎమ్మెల్యేలకు వై ప్లస్ భద్రత కల్పించడంపై సామ్నా పత్రిక తన వ్యాసంలో ఖండించింది. ఒక్కో ఎమ్మెల్యే 50 కోట్లకు అమ్ముడుపోయారంటూ విమర్శించింది. దీని వెనుక బీజేపీ కాక ఇంకెవరుంటారని అనుమానం వ్యక్తం చేసింది. రెబెల్ ఎమ్మెల్యేల స్టోరీ, స్క్రిప్టు మొత్తం బీజేపీనే ఇచ్చిందని ఆరోపించింది.