I will also resign - Sanjay challenges KCR
mictv telugu

నేనూ రాజీనామా చేస్తా – కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్

September 12, 2022

టీబీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమైంది. గ్రేటర్ హైదరాబాదులో పది రోజుల పాటు ఈ పాదయాత్ర జరుగనుంది. ఈ సందర్భంగా కేసీఆర్‌పై విరుచుకు పడ్డారు. కేంద్రం ఇచ్చిన గెజిట్‌లో మోటార్లకు మీటర్లు పెట్టాలని ఉందని, మీటర్లు లేకుండా కొత్త కనెక్షన్లు ఇవ్వవద్దని బిల్లులో చెప్పారంటూ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తనదైన శైలిలో కౌంటరిచ్చారు. ఈ అంశంపై సవాల్ విసిరారు. కేంద్రం పెట్టిన బిల్లును కేసీఆర్‌కు పంపిస్తా.. అందులో మోటార్లకు మీటర్లు పెట్టాలని ఉంటే నేను రాజీనామా చేస్తా? లేకుంటే ఆయన రాజీనామా చేస్తారా? అంటూ మండిపడ్డారు. చిన్న వర్షం పడినా హైదరాబాద్ మునిగిపోతుందని, నగరాన్ని ఇస్తాంబుల్ చేస్తానని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. కాగా, సోమవారం అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడుతూ.. పలు అంశాల్లో కేంద్రం పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్, వ్యవసాయం మాత్రమే మిగిలి ఉన్నాయని, వాటిని కూడా ప్రైవేటు పరం చేయడానికి కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని విమర్శించార. అర్ధం పర్ధం లేని విధానాలతో రైతులు సొంత పొలంలోనే కూలీలుగా మారే దుస్థితి వస్తుందని హెచ్చరించారు. ప్రాణం ఉన్నంతవరకు రైతులకు అన్యాయం జరుగనివ్వనని కరాఖండీగా చెప్పారు.